గర్భిణి దారుణహత్య..దహనం: మంటల్లో మాడిపోయిన శిశువు

Siva Kodati |  
Published : Sep 06, 2019, 08:08 AM ISTUpdated : Sep 06, 2019, 08:22 AM IST
గర్భిణి దారుణహత్య..దహనం: మంటల్లో మాడిపోయిన శిశువు

సారాంశం

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ నిండు గర్భిణిని అత్యంత కిరాతకంగా హత్య చేయడమే కాకుండా ఆనవాళ్లు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. మహిళ శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆమె కడుపులోని బిడ్డ కూడా బయటికి వచ్చి మంటల్లో మాడిపోయింది

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ నిండు గర్భిణిని అత్యంత కిరాతకంగా హత్య చేయడమే కాకుండా ఆనవాళ్లు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు.

హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై రంగంపల్లి గేటు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న గుంతలో పూర్తిగా కాలిపోయిన ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.... ఆమె శరీరం గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో.. ఆమె ఎవరు..? ఇక్కడే హత్య చేశారా..? లేక మృతదేహాన్ని ఎక్కడి నుంచైనా తెచ్చి ఇక్కడ తగులబెట్టారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. మహిళ శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆమె కడుపులోని బిడ్డ కూడా బయటికి వచ్చి మంటల్లో మాడిపోయింది. ఈ దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?