
కంటోన్మెంట్ : bowenpallly ఠాణా పరిధిలో సంచలనం సృష్టించిన International badminton player ప్రవీణ్ రావు, ఆయన సోదరులు సునీల్ రావు, నవీన్ రావుల kidnap caseలో పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సహా మొత్తం 37 మందిపై 70 ప్రతులతో కూడిన అభియోగ పత్రాలను న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే కేసు విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది జనవరి 5న రాత్రి 7గంటల సమయంలో ప్రవీణ్ రావు, అతని సోదరుడు నివసించే మనోవికాస్ నగర్ లోని క్రిష్ణ రెసిడెన్సిలోకి ఐటి అధికారుల వేషధారణలతో దుండగులు చొరబడ్డారు. సినీ ఫక్కీలో ఆ ముగ్గురు సోదరులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావడంతో.. తప్పించుకునే వీలు లేదని గ్రహించిన దుండగులు.. ఆ ముగ్గురిని జనవరి 6 అప్పా జంక్షన్ వద్ద వదిలి వెళ్లారు.
ఈ అపహరణకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీనుతో కలిసి పథకం రచించారని తెలుసుకున్న పోలీసులు జనవరి 6న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మిగతా నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు బెయిల్పై విడుదల అయ్యారు.
కాగా, టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పినట్లే అన్నీ చేశామని బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు నిందితులు బోయ సంపత్ కుమార్, మల్లికార్డున్ రెడ్డి నిరుడు జనవరి 21న పోలీసులకు చెప్పారు. వారిద్దరిని పోలీసులు జనవరి 20న తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు.
గుంటూరు శ్రీను మిత్రులంటూ విజయవాడ నుంచి వచ్చినవారికి కూకట్ పల్లిలోని లాడ్జిలో గదులు తీసిచ్చామని, మేడం చెప్పడంతో చెన్నయ్యతో కలిసి బైక్ మీద ప్రవీణ్ రావు ఇంటి వద్దకు నాలుగైదు సార్లు వెళ్లామని వారు చెప్పారు. కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియ సూత్రధారిగా వ్యవహరించారని, మిగతా విషయాలు తమకు తెలియవని వారు చెప్పారు. వారిని జనవరి 21న మరింతగా లోతుగా విచారించారు.
జనవరి 5వ తేదీన ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన తీరును తెలుసుకునేందుకు జనవరి 21న నిందితులను ఘటనా స్థలానికి తీసుకుని వెళ్లి సీన్ రీకన్ స్ట్రక్ట్ చేయనున్నారు. బాధితులను ఏ కారులో తీసుకుని వెళ్లారు, మధ్యలో ఎక్కడైనా ఆగారా, వారితో సంతకాలు చేయించుకునేందుకు ఎలా బెదిరించారు అనే విషయాలపై వారిని ప్రశ్నించారు.
ఈ కేసులో వారిద్దరి పాత్రతో పాటు ఇతర నిందితులకు వారు ఎలా సహకరించారనే విషయాలను తెలుసుకోవడానికి విచారణ చేయాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసులో అత్యధికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందినవారే. వారి వివరాలు ఇలా ఉన్నాయి.. మాదాల సిద్ధార్థ (29), బొజ్జగాని దేవప్రసాద్ (24), మొగలి భాను (25), రాగోలు అంజయ్య (29), పదిర రవిచంద్ర (24), పచిగల్లి రాజా అలియాస్ చంటి (28), బానోతు సాయి (23), దేవరకొండ కృష్ణవంశీ (24), దేవరకొండ కృష్ణసాయి (24), దేవరకొండ నాగరాజు (25), బొజ్జగాని సాయి (23), కందుల శివప్రసాద్ (27), మీసాల శ్రీను (28), అన్నేపాక ప్రకాష్ (20), షేక్ దావూద్ 31).