జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర గందరగోళం.. బీజేపీ కార్పొరేటర్లపై మేయర్ విజయలక్ష్మి సీరియస్..

By Sumanth KanukulaFirst Published Dec 24, 2022, 11:20 AM IST
Highlights

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే.. సభలో గందరగోళం నెలకొంది. 

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే.. సభలో గందరగోళం నెలకొంది. సమావేశాలను బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. బీజేపీ కార్పొరేటర్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి పోడియాన్ని చుట్టుముట్టారు. నగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ వారిని వారించే ప్రయత్నం చేశారు. 

ఇక, రూ. 6,624 కోట్ల 2023-2024 వార్షిక బడ్జెట్‌కు జీహెచ్‌ఎంసీ ఆమోదం తెలిపింది. సభ్యుల గందరగోళం మధ్యే బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్టుగా మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. అయితే ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్‌కు ఆమోదంపై విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే సభలో బీజేపీ, బీఆర్ఎస్‌ కార్పొరేటర్లు పోటాపోటీగా నినాదాలు చేశారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. 

అయితే బీజేపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ గద్వాల విజయలక్ష్మీ సీరియస్ అయ్యారు. ఇదేనా మహిళకు ఇచ్చే గౌరవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొడియం వద్దకు వచ్చిన సభ్యులు వారి స్థానాల్లోకి వెళ్లాలని మేయర్ సూచించారు. ఇలాగే ఆందోళనలు చేస్తే సభను వాయిదా వేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే మేయర్‌కు, బీజేపీ కార్పొరేట్లరకు మధ్య వాగ్వాదం నెలకొంది. 

click me!