అమీన్‌పూర్‌లో దారుణం.. భార్య, ఆమె బంధువులపై కత్తితో దాడి.. ఒకరు మృతి..

Published : Dec 24, 2022, 09:57 AM IST
అమీన్‌పూర్‌లో దారుణం.. భార్య, ఆమె బంధువులపై కత్తితో దాడి.. ఒకరు మృతి..

సారాంశం

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. వాణి నగర్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఆమె బంధువులపై కత్తితో దాడి చేశాడు.

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. వాణి నగర్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఆమె బంధువులపై కత్తితో దాడి చేశాడు. వివరాలు.. నిందితుడు శ్రీనివాస్‌కు అతని భార్య సునీతకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్తతో విభేదాల కారణంగా సుజాత పుట్టింటి వద్దే ఉంటుంది. ఈ రోజు ఉదయం సునీత తన అక్క సుజాత, అన్న కుమారుడు సాయితో కలిసి బైక్‌పై డ్యూటీకి బయలుదేరింది. అయితే ఆ సమయంలో వారిపై శ్రీనివాస్ వారిపై దాడి  చేశాడు. కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు.

ఈ దాడిలో సునీత అక్క సుజాత్ మృతిచెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సునీత, సాయిలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్