దెబ్బ ఎలా తగిలింది: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు

By narsimha lode  |  First Published Dec 11, 2023, 6:31 PM IST

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు పరామర్శించారు.



హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును  తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడు  సోమవారంనాడు పరామర్శించారు. 

సోమవారంనాడు సాయంత్రం  హైద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను  చంద్రబాబు పరామర్శించారు.  కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.  కేసీఆర్ కు అందుతున్న వైద్యం గురించి చంద్రబాబు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  కేసీఆర్ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందనే విషయాన్ని కూడ  చంద్రబాబు వైద్యులను అడిగారు. ఈ సంఘటన ఎలా జరిగిందో కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.

Latest Videos

కేసీఆర్ ను పరామర్శించిన తర్వాత చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ఆరు వారాల్లో కేసీఆర్  తిరిగి నడిచే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని చంద్రబాబు తెలిపారు. కేసీఆర్ కోలుకొని  త్వరగా ప్రజలకు  సేవ చేసేందుకు రావాలనే ఆకాంక్షను  చంద్రబాబు వ్యక్తం చేశారు.   వైద్యుల అభిప్రాయం మేరకు  త్వరగానే కేసీఆర్ త్వరగా కోలుకుంటారని భావిస్తున్నట్టుగా  చంద్రబాబు తెలిపారు.  కేసీఆర్ తిరిగి ప్రజలకు సేవ చేసేందుకు త్వరగా  ఆసుపత్రి నుండి బయటకు రావాలని చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. 

ఈ నెల 7వ తేదీన  ఎర్రవెల్లి  పామ్ హౌస్ లో ని బాత్రూంలో  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  కాలు జారి పడ్డారు. దీంతో  కేసీఆర్  ఎడమ కాలి తుంటికి ఆపరేషన్ నిర్వహించారు.  ఈ నెల 8వ తేదీన కేసీఆర్  కు హిప్ రిప్లేస్ మెంట్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్స జరిగిన తర్వాత నుండి  కేసీఆర్ యశోద ఆసుపత్రిలోనే  ఉన్నారు.  కేసీఆర్ వెంట  కుటుంబ సభ్యులున్నారు.  కేసీఆర్ ను  పలువురు  వీఐపీలు, మంత్రులు, రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఇవాళ పరామర్శించారు.  

click me!