అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ (minister ponnam prabhakar) అన్నారు. మిగిలిన గ్యారెంటీలను కూడా రాబోయే 100 రోజుల్లో అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
గతంలో బీఆర్ఎస్ నాయకులకు కూడా ప్రగతి భవన్ లోకి ప్రవేశం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తమ ప్రభుత్వంలో వారిప్పుడు స్వేచ్ఛగా ప్రగతి భవన్ లోకి అడుగు పెట్టవచ్చని తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆయన గజ్వేల్ పట్టణానికి వచ్చారు. కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
ప్రభుత్వంలో నా పాత్ర ఉండదు.. సలహాలు, సూచనలు కావాలంటే ఇస్తా - జానారెడ్డి
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం కొలువుదీరిన 2 రోజుల్లోనే 2 గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. మిగిలిన హామీలను కూడా రాబోయే 100 రోజుల్లో అమల్లోకి తీసుకొస్తామని అన్నారు. రైతుబంధు ఇంకా ఎప్పుడు వేస్తారని మంత్రి హరీశ్ రావు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
సిద్దిపేట జిల్లా కలెక్టరును కలిసి జిల్లా లో ఉన్న సమస్యల పై సమీక్ష చేసి నివేదిక అందచేయాలి అని ఆదేశం ఇచ్చిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు pic.twitter.com/JR3oO15zGW
— Ponnam Prabhakar (@PonnamLoksabha)తమ ప్రభుత్వం కొలువుదీరి ఇంకా పది రోజులు కూడా కాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పుడే రైతులకు పెట్టుబడి సాయం విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించడం సరైంది కాదని తెలిపారు. తమ ప్రభుత్వం మాట మీద నిలబడుతుందని చెప్పారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీసీబంధుపై సమీక్ష నిర్వహిస్తామని అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ప్రకాశ్ రాజ్, మాజీ మంత్రులు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతీ శాఖపై శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యుత్ శాఖలో రూ.85 వేల కోట్ల అప్పు ఉందని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలన నచ్చకే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని తెలిపారు. గతంలో ప్రజలకు సమస్య వస్తే పాలకులను, అధికారులను కలిసే పరిస్థితులు లేవని అన్నారు. కానీ ఇక నుంచి అలా ఉండదని తెలిపారు. అయితే తమకు సమస్యలను పరిష్కరించే సమయం ఇవ్వాలని మంత్రి కోరారు.