కేసీఆర్ పథకాలను కాపీ పేస్టు చేస్తున్నారు: బాబుపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

By pratap reddyFirst Published Jan 23, 2019, 6:08 PM IST
Highlights

చిత్తశుద్ది లేని శివపూజలు చేస్తే ఒరిగేదమీ లేదని కేటీఆర్ అన్నారు. ఆంధ్రా ప్రజలు, అక్కడి జర్నలిస్టులు తెలివైన వాళ్లు. చైతన్యవంతులని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు పెద్దపీట వేసి సంస్థాగతంగా టీఆర్ఎస్ గౌరవించిందని అన్నారు. 

హైదరాబాద్: తమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పథకాలను కాపీ చేసి పేస్టు చేస్తే గెలిచిపోతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైనవారనే విషయాన్ని చంద్రబాబు మరిచిపోతున్నారని ఆయన అన్నారు. 

ఎమ్మెల్యేగా గెలిచిన జర్నలిస్టు క్రాంతి కిరణ్ అభినందన సభలో ఆయన బుధవారం మాట్లాడారు. చంద్రబాబు నాయుడివి ఆపద మొక్కులు ఆయన అన్నారు. మన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఏం చేస్తే అవి చేస్తే తాను కూడా గెలుస్తాననిని బాబు అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

చిత్తశుద్ది లేని శివపూజలు చేస్తే ఒరిగేదమీ లేదని కేటీఆర్ అన్నారు. ఆంధ్రా ప్రజలు, అక్కడి జర్నలిస్టులు తెలివైన వాళ్లు. చైతన్యవంతులని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు పెద్దపీట వేసి సంస్థాగతంగా టీఆర్ఎస్ గౌరవించిందని అన్నారు. 

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో శ్రీకారం చుట్టిందని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి బాధ్యత తనదని ఆయన అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఓ సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. 

న్యాయవాదులు, కళాకారుల సంక్షేమ కోసం కృషి చేస్తున్నామని, కోర్టు వివాదాలు లేకుండా ఇండ్ల స్థలాలు, హెల్త్‌కార్డుల పంపిణీకి చిత్తశుద్ధితో ముందుకు పోతున్నామని చెప్పారు. 

click me!