జైలు నుంచి విడుదల: భూమా అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్

By telugu teamFirst Published Jan 24, 2021, 7:06 AM IST
Highlights

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో సికింద్రాబాదు కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి టీడీపీ నేత భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.

హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు, పార్టీ నేత భూమా అఖిలప్రియతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడారు. అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె జైలు నుంచి శనివారంనాడు విడుదలయ్యారు. 

ధైర్యంగా ఉండాలని, ఎన్ని కష్టాలు వచ్చినా మనోనిబ్బరంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు అఖిలప్రియకు చెప్పారు. తాను ధైర్యంగా ఉంటూ సహచరులకు ధైర్యం చెప్పాలని ఆయన అన్నారు. 

అఖిలప్రియ 18 రోజుల పాటు జైలులో ఉ్నారు. అఖిలప్రియను చూసేందుకు ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలుల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అబిమానులు పెద్ద యెత్తున చంచల్ గుడా జైలు వద్దకు చేరుకున్నారు. 

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయి చంచల్ గుడా జైలులో ఉంటున్న బోయ సంపత్, మల్లికార్జున్ రెడ్డి, సిద్దార్థల పోలీసు కస్టడీ శనివారంనాడు ముగిసింది. బోయిన్ పల్లి పోలీసులు కోర్టు అనుమతితో సిద్ధార్థను ఒక రోజు, సంపత్, మల్లికార్డున్ రెడ్డిలను మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. శనివారంనాడు ముగ్గురిని కూడా చంచల్ గుడా జైలుకు తరలించారు. 

click me!