బతిమాలాడి సాంబార్ రైస్ పెట్టాం: అఖిలప్రియ ఆరోగ్యంపై అధికారుల ప్రకటన

Siva Kodati |  
Published : Jan 07, 2021, 08:36 PM IST
బతిమాలాడి సాంబార్ రైస్ పెట్టాం: అఖిలప్రియ ఆరోగ్యంపై అధికారుల ప్రకటన

సారాంశం

కిడ్నాప్ కేసులో అరెస్టయి రిమాండ్‌లో వున్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోగ్య పరిస్ధితిపై చంచల్‌గూడ జైలు అధికారులు స్టేట్‌మెంట్ విడుదల చేశారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని వారు తెలిపారు

కిడ్నాప్ కేసులో అరెస్టయి రిమాండ్‌లో వున్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోగ్య పరిస్ధితిపై చంచల్‌గూడ జైలు అధికారులు స్టేట్‌మెంట్ విడుదల చేశారు.

ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని వారు తెలిపారు. ఉదయం అఖిలప్రియకు ఫిట్స్ వచ్చాయని.. రాత్రి నుంచి అఖిలప్రియ ఎలాంటి అల్పాహారం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.

ఉదయం మందులు వేసుకోలేదని.. ఏమీ తినకపోవడంతో నీరసంగా వున్నారని చెప్పారు. అఖిలప్రియకు సిబ్బంది నచ్చజెప్పి సాంబార్ రైస్ తినిపించారని అధికారులు తెలిపారు. 

అంతకుముందు అఖిలప్రియ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మెరుగైన వైద్యం కోసం తనను ఆసుపత్రికి తరలించాలని అఖిలప్రియ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిని న్యాయస్ధానం.. జైల్లో అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని తెలిపింది.

Also Read:సుబ్బారెడ్డినే చంపాలనుకుంది.. మేమెంత: అఖిలప్రియపై నవీన్ రావు బంధువు వ్యాఖ్యలు

జైల్లో వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని హైకోర్టు వెల్లడించింది. రేపు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో రేపు కౌంటర్ దాఖలు చేయనున్నారు పోలీసులు.

అంతకుముందు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, ఓ భూ వివాదంలో ప్రవీణ్ రావు, సునీల్, నవీన్ అనే ముగ్గురు సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు తమ రిపోర్టులో అఖిలప్రియను ఏ1 గా పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా భువనేశ్వరి Nara Bhuvaneshwari Pays Tribute At NTR
NTR 103rd Jayanti: ఎన్టీఆర్ 103వ జయంతి నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu