ఆబిడ్స్ లో విషాదం; చిన్నారి పాపను చిదిమేసిన వాటర్ ట్యాంకర్

Siva Kodati |  
Published : Mar 01, 2019, 11:46 AM IST
ఆబిడ్స్ లో విషాదం; చిన్నారి పాపను చిదిమేసిన వాటర్ ట్యాంకర్

సారాంశం

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ చిన్నారి దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళితే..  ఎనిమిదేళ్ల దియా జైన్.... అబిడ్స్‌లోని రోజరి స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. 

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ చిన్నారి దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళితే..  ఎనిమిదేళ్ల దియా జైన్.... అబిడ్స్‌లోని రోజరి స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళ్లేందుకు తండ్రి నరేశ్ జైన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది.

రోడ్డుపై వెళుతుండగా వెనుక నుంచి దూసుకువచ్చిన వాటర్ ట్యాంకర్ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దియా మీదుగా ట్యాంకర్ దూసుకెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే మరణించింది. తీవ్రగాయాల పాలైన నరేశ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ