తెలంగాణలో వర్షాలు, వరదలు: హైద్రాబాద్‌కు రేపు రానున్న కేంద్ర బృందం

By narsimha lodeFirst Published Oct 21, 2020, 11:42 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నష్టంపై అంచనా వేయడానికి కేంద్రబృందం ఈ నెల 22 తేదీన రానుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నష్టంపై అంచనా వేయడానికి కేంద్రబృందం ఈ నెల 22 తేదీన రానుంది.

ఈ నెల 13వ తేదీ నుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైద్రాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం భారీగా నష్టం చేసింది. 

also read:వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ. 10 వేలు: కేసీఆర్

రాష్ట్రంలో సుమారు ఐదువేల కోట్ల ఆస్ది నష్టం జరిగి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. ప్రాథమిక అంచనా మేరకు ఐదువేల కోట్లుగా ప్రభుత్వం అంచనాలు వేసింది. 

వరదలు తగ్గిన తర్వాత వరదలపై  సమగ్రంగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.వరదలు, వర్షంతో దెబ్బతిన్న  రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ నెల 22వ తేదీన సాయంత్రం  కేంద్ర బృందం హైద్రాబాద్ కు రానుంది.

రెండు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది.

click me!