కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన ముగిసింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని బృందం సీఎస్ తో భేటీ అనంతరం పర్యటనను ముగించింది
కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన ముగిసింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని బృందం సీఎస్ తో భేటీ అనంతరం పర్యటనను ముగించింది.
అంతకుముందు గచ్చిబౌలీ లోని టీఐఎంఎస్, గాంధీ ఆసుపత్రి, దోమల్‌గూడలోని దోభీ గల్లీ కంటైన్‌మెంట్ ఏరియాలను సందర్శించింది. అనంతరం రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై కేంద్ర బృందం ముందు వైద్య శాఖ అధికారులు ప్రజేంటేషన్ ఇచ్చారు.
undefined
Also Read:అంత్యక్రియల్లో 500 మంది: మృతుడికి కరోనా, భయాందోళనలో గ్రామస్థులు
రాష్ట్రంలో సర్వైలెన్స్ , కంటైన్‌మెంట్ చర్యలు, ఆసుపత్రుల సన్నద్ధత, వైద్య సంరక్షన పరికరాల సమీకరణ, వైరస్ నివారణా చర్యలపై బృంద సభ్యులకు వివరించారు. రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని, మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేశామని కేంద్ర బృందానికి తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిందని వెల్లడించారు.
Also Read:తెలంగాణలో కరోనా మరణాలు 1.1 శాతమే: మంత్రి ఈటల
ఇతర రాష్ట్రాల క్షేత్ర స్థాయి పర్యటనల అనుభవాన్ని పంచుకుందన్నారు. రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు , వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం , కాంటాక్ట్ ట్రేసింగ్- క్లినికల్ మెనేజ్‌మెంట్ పై సూచనలు చేసిందని సీఎస్ చెప్పారు.
రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారని చీఫ్ సెక్రటరీ వెల్లడించారు.