పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో హోటల్ నిర్వాకం:ఇడ్లీలో జెర్రీ

Published : Jul 18, 2022, 10:00 PM IST
 పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో హోటల్  నిర్వాకం:ఇడ్లీలో జెర్రీ

సారాంశం

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో హెటల్ నుండి తెచ్చుకొన్న ఇడ్లీలో జెర్రీ ప్రత్యక్షం కావడంతో రమ అనే మహిళ షాక్ కు గురైంది. హోటళ్లలో నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదని ఈ ఘటన రుజువు చేస్తుంది. నాణ్యమైన ఆహారం అందించని హోటళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పెద్దపల్లి: Hotel నుండి తెచ్చుకున్న Tiffin  లో  జెర్రీ ప్రత్యక్షం కావడంతో  టిపిన్ తిన్న మహిళ ఆందోళన చెందుతుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకొంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్ స్టేషన్ సమీపంలోని హోటల్ నుండి రమ అనే మహిళ ఇడ్లీలు తెప్పించుకుంది.  నాలుగు ఇడ్లీలు తిన్న తర్వాత ఐదో ఇడ్లీ తినే సమయంలో ఇడ్లీలో Centipedes ప్రత్యక్షమైంది. దీంతో ఆమె ఆందోళన చెందుతుంది. Rama కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఉదయాన్నే కూరగాయలు విక్రయించేందుకు ఇంటి నుండి వచ్చిన రమ టిఫిన్ కోసం హోటల్ నుండి Idli  తెప్పించుకుంది.

ఆకలితో ఉన్న ఆమె గబగబ ఇడ్లీలు తిన్నది. చివరి ఇడ్లీ తినే సమయంలో జెర్రీ రావడంతో ఆమె కంగారు పడింది. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఇడ్లీలో జెర్రీ ప్రత్యక్షం కావడమని ఆమె ఆరోపిస్తున్నారు. హోటళ్లలో ఆహారం నాణ్యత విషయమై అధికారులు పట్టీ పట్టనట్టుగా వ్యవహరించడంపై కూడా స్థానికులు విమర్శలు చేస్తున్నారు. నాణ్యత పాటించని హోటళ్లపై చర్యలు తీసుకొంటే ఈ తరహా ఘటనలు పునరావృతం కావనే అభిప్రాయాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ