కేంద్రం తరపున తెలంగాణ విమోచన దినం.. కౌంటర్‌గా టీఆర్ఎస్ స్కెచ్ , ‘సెప్టెంబర్ 17’న ఏం జరగనుంది

By Siva KodatiFirst Published Sep 2, 2022, 7:50 PM IST
Highlights

తెలంగాణలో బీజేపీ- టీఆర్ఎస్ కత్తులు దూస్తున్న వేళ ఈసారి సెప్టెంబర్ 17న రాష్ట్రంలో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది. కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన దినం నిర్వహించనుంది. అటు బీజేపీకి కౌంటర్‌గా టీఆర్ఎస్ సర్కార్ భారీ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. 

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఏడాది పాటు అమృతోత్సవాలు నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. 

మరోవైపు బీజేపీకి కౌంటర్‌గా కేసీఆర్ సర్కార్ కూడా కార్యక్రమాలు నిర్వహించనుంది. నిజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు నిండనుంది. దీంతో ఏడాది పాటు వజ్రోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ రైతన్న పోరాటాన్ని హైలైట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహించనుంది. రేపు తెలంగాణ కేబినెట్, టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశాల్లో దీనిపై చర్చించనున్నారు. 
 

click me!