చెన్నై జైల్లో ‘ఎఫ్ డి స్కామ్ పాఠాలు’... తెలుగు అకాడమీ కేసులో సూత్రధారి విచారణలో విస్తుపోయే వాస్తవాలు...

By AN Telugu  |  First Published Oct 13, 2021, 9:09 AM IST

నార్తర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు సహనిందితులే  వీటిని నేర్పించారని సాయి బయటపెట్టాడు. హైదరాబాదులోని అంబర్పేట్ ప్రాంతానికి చెందిన సాయి కుమార్ మొదట స్వాల్‌ కంప్యూటర్స్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు.  


హైదరాబాద్ : తెలుగు అకాడమీకి చెందిన రూ. 64.5 కోట్ల fixed deposit scamలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది.  తాజాగా సూత్రధారి చుండూరి వెంకట కోటి సాయి కుమార్ విచారణలో సిసిఎస్ పోలీసులు పలు కీలక అంశాలు గుర్తించారు. ఎఫ్‌డీ స్కామ్‌కు సంబంధించిన విషయాలను చెన్నై జైల్లో నేర్చుకున్నట్లు వెల్లడైంది.

నార్తర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు సహనిందితులే  వీటిని నేర్పించారని సాయి బయటపెట్టాడు. హైదరాబాదులోని అంబర్పేట్ ప్రాంతానికి చెందిన సాయి కుమార్ మొదట స్వాల్‌ కంప్యూటర్స్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు.  

Latest Videos

దీనికి హైటెక్ సిటీ తో పాటు తమిళనాడులోని చెన్నైలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేశాడు. అమెరికాకు చెందిన ప్రాజెక్టులు కైవసం చేసుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో సాయికి ఈ రంగంలో నష్టాలే మిగిలాయి.  ఈ క్రమంలో అతనికి Tamil Nadu gangతో పరిచయమైంది. అప్పటికి ఈ గ్యాంగ్  NCL కు చెందిన FDలపై కన్నేసింది.

చెన్నై లోని పలు బ్యాంకుల్లో ఉన్న రూ. 25 కోట్లు కాజేయడానికి పథకం సిద్ధం చేసింది. ఈ క్రమంలో సాయితో ఒప్పందం చేసుకుంది. ఎన్సీఎల్ లిక్విడేట్  చేయగా వచ్చిన రూ. ఆరు కోట్లను స్వాల్ సంస్థ పేరిట ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై శాఖలోని కరెంట్ అకౌంట్ లోకి మళ్ళించింది.  ఆ మొత్తాన్ని డ్రా చేసి ఇచ్చినందుకు కోటి రూపాయలు కమిషన్గా స్థాయికి అందించింది.

ఇప్పటికి మూడు ఎఫ్ డీల స్కాం : NCL scam వెలుగులోకి రావడంతో చెన్నైకి చెందిన సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సూత్రధారులతో సహా.. మొత్తం 15 మందిని అరెస్టు చేయగా, వీరిలో సాయి కూడా ఉన్నాడు.  ఈ కేసులో జైలుకు వెళ్లిన saikumar అక్కడే ఎఫ్‌డీల స్కామ్‌ ఎలా చేయాలి అనే అంశాలను వీరి ద్వారా తెలుసుకున్నాడు.  జైలు నుంచి బయటకు వచ్చిన సాయి రియల్టర్‌ అవతారమెత్తాడు.

ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన నండూరి వెంకట రమణతో పరిచయం ఏర్పడింది. తన స్వస్థలం లో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించే వెంకటరమణకు ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం ఉంది. ఆ సంస్థకు కావాల్సిన బిల్‌ బుక్స్‌ సహా అన్ని రికార్డులనూ ముద్రించి అందిస్తుంటాడు.  

అయితే తన పిల్లల చదువు నిమిత్తం హైదరాబాద్ కు వలస వచ్చిన వెంకటరమణ సైనిక్ పురి ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఇతను కూడా రియల్టర్ గా మారాడు.  ఈ క్రమంలోనే సాయితో పరిచయం ఏర్పడింది.  వీరిద్దరూ మరికొందరితో కలిసి 2012లో ఏపీ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ  ఎఫ్‌డీలు,  2015 లో ఏపీ హౌసింగ్ బోర్డ్ ఎఫ్‌డీలు, తాజాగా telugu akademiల సొమ్ము కాజేశారు.

తెలుగు అకాడమీ స్కాంలో ట్విస్ట్: ఏపీ డబ్బులూ కొట్టేసిన సాయికుమార్ గ్యాంగ్.. 15 కోట్ల మేర డ్రా

ఏపీలోనూ కుంభకోణాలు : తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం నిందితులు 11 ఏళ్లుగా ఈ స్కామ్ లు చేస్తున్నట్లు సిసిఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ఏపీలోని ఏపీ హౌసింగ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ. 10 కోట్లు, ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ కు చెందిన రూ.ఐదు కోట్లు కొట్టేసి, ఆ డబ్బును ఏపీ మర్కంటైల్ బ్యాంకులోకి  మళ్లించినట్లు నిందితులు వెల్లడించారు.  తెలుగు అకాడమీ కేసులో ఇప్పటి వరకు 14 మందిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

2009 నుంచి సాయికుమార్ ఫిక్స్ డ్ డిపాజిట్ల కుంభకోణం చేశారని, ఇతనిపై వివిధ ప్రాంతాల్లో ఎనిమిది కేసులు ఉన్నట్లు తెలిసిందని సీసీఎస్ అధికారులు పేర్కొంటున్నారు.  తొమ్మిది మంది కస్టడీ మంగళవారం ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం Chanchalguda Jailకు తరలించారు. మరోపక్క కెనరా బ్యాంక్ చందానగర్ మాజీ మేనేజర్ సాధనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమెకు రూ.1.99 కోట్లు సాయి కుమార్ అందించినట్లు వెల్లడించాడు. సాయి కుమార్ తో పాటు అతని అనుచరులను మరోసారి కస్టడీలోకి తీసుకోవడానికి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈనెల 16న కోర్టులో విచారణ జరిగే అవకాశాలున్నాయి. 
 

click me!