Telugu akademi scam: మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి పీఏ వినయ్ అరెస్ట్

Published : Oct 08, 2021, 05:05 PM ISTUpdated : Oct 08, 2021, 06:32 PM IST
Telugu akademi scam: మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి పీఏ వినయ్ అరెస్ట్

సారాంశం

 తెలుగు అకాడమీ స్కాంలో  మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి పీఏ  వినయ్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ కేసులో వినయ్ కుమార్ అరెస్ట్ తో  మొత్తం అరెస్టుల సంఖ్య 12 కి చేరింది.

Telugua akademi తాజా మాజీ డైరెక్టర్ somi reddy పీఏ vinay kumarను శుక్రవారం నాడు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. చీఫ్ అకౌంటెంట్ రమేష్ తో కలిసి నిధుల గోల్‌మాల్ చేశారని ccs పోలీసులు నిర్ధారించారు. వినయ్ కుమార్ అరెస్ట్‌తో ఈ  కేసులో అరెస్టుల సంఖ్య 12 కి చేరింది.

also read:telugu akademi scam: రంగంలోకి దిగనున్న ఈడీ

తెలుగు అకాడమీలో మస్తాన్ వలీ(యూనియన్ బ్యాంక్ మేనేజర్) రాజ్‌కుమార్ (ఏజంట్) సత్యనారాయణరాజు (మర్కంటైల్ బ్యాంక్), పద్మావతి(మర్కంటె్ బ్యాంక్), మొయినుద్దీన్ (మర్కంటైల్ బ్యాంక్), చందురి వెంకటసాయి(ఏజంట్),సందురి వెంకట(ఏజంట్), వెంకటేశ్వరరావు(ఏజంట్), రమేష్ (తెలుగు అకాడమీ ఏసీఓ), సాధన(కెనరా బ్యాంక్ మేనేజర్), పద్మనాభన్ లను ఇప్పటివరకు అరెస్ట్ చేశారు.  ఇవాళ వినయ్ కుమార్  అరెస్ట్ చూపారు పోలీసులు.

తెలుగు అకాడమీలో నిధుల కుంభకోణం వెలుగు చూసిన తర్వాత సోమిరెడ్డిని విధులనుండి తప్పించింది ప్రభుత్వం. సోమిరెడ్డి వద్ద వినయ్ కుమార్ పీఏ పనిచేశారని పోలీసులు తెలిపారు. 

తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల నిధులను నిందితులు పథకం ప్రకారం డ్రా చేశారు. ఈ కేసులో మరికొందరిపై సీసీఎస్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కృష్ణారెడ్డి, మదన్, భూపతి, మోహన్ రాజ్ ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈ కుంభకోణంలో సాయికుమార్ కీలక పాత్ర ధారిగా పోలీసులు తేల్చారు. సాయికుమార్ ఈ కుంభకోణానికి ప్లాన్ వేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.


 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం