గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి: సీసీఎంబీ కీలక సర్వే

By narsimha lodeFirst Published Sep 28, 2020, 2:56 PM IST
Highlights

గాలి ద్వారా కూడ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందా లేదా అనే విషయమై తెలుసుకొనేందుకుగాను హైద్రాబాద్ సీసీఎంబీ కీలక పరిశోధనలను ప్రారంభించింది.

హైదరాబాద్:గాలి ద్వారా కూడ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందా లేదా అనే విషయమై తెలుసుకొనేందుకుగాను హైద్రాబాద్ సీసీఎంబీ కీలక పరిశోధనలను ప్రారంభించింది.

గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతోందనే విషయమై ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు లేవు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.గాలిలో వైరస్ వ్యాప్తి చెందుతోందనేందుకు రుజువులున్నాయని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 300 శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించారు.

ఆసుపత్రుల పరిసరాల్లో పాజిటివ్ ఉన్న వ్యక్తుల నుండి వైరస్ ఎలా సంక్రమిస్తోందో అని అంచనా వేసేందుకు సీసీఎంబీ ఈ పరిశోధన చేపట్టింది.   ఈ పరిశోధనను 10 రోజుల క్రితమే ప్రారంభించింది.

also read:సీసీఎంబీ షాకింగ్ సర్వే: హైద్రాబాద్ మురుగునీటిలో కరోనా ఆనవాళ్లు

క్లోజ్డ్ హాళ్లు, బ్యాంకులు, మాల్స్ వంటి రద్దీ ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తిని తెలుసుకొనేందుకు ఆయా ప్రాంతాల నుండి శాంపిళ్లను సేకరిస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ పరిశోధనల ద్వారా వైరస్ గాలి ద్వారా ఏ రకంగా వ్యాప్తి చెందుతోందో స్పష్టంగా తెలుసుకొనే అవకాశం ఉంటుంందని  సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు.
హైద్రాబాద్ మురుగు నీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లను సీసీఎంబీ గుర్తించింది. 
 

click me!