ఫోర్జరీలతో రూ. 480 కోట్లకు కుచ్చుటోపీ.. వెలుగులోకి భారీ మోసం...

Published : Feb 12, 2021, 04:42 PM IST
ఫోర్జరీలతో రూ. 480 కోట్లకు కుచ్చుటోపీ.. వెలుగులోకి భారీ మోసం...

సారాంశం

తెలంగాణలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో ఫోర్జరీ సంతకాలు, ఫోర్జరీ పత్రాలతో రూ. 480 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు మోసగాళ్లు. హైదరాబాద్ కు చెందిన పరుచూరి కుమార్ అలియాస్ కనుగంటి సురేష్ కుమార్, అతని భార్య పోకల పల్లవిలు ఫోర్జరీ సంతకాలు, ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులను మోసగిస్తున్నారు. 

ఈ మేరకు వీరిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. వీరు ఎస్‌బీఐలో ఫోర్జరీ పత్రాలు పెట్టి రూ. 480 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఇటీవల వీరి మోసాన్ని ఎస్బీఐ అధికారులు గుర్తించారు. 

అంతేకాదు ఈ చీటింగ్‌లో ఎస్బీఐ అధికారి ప్రమేయం కూడా ఉందని నిర్ధారించుకున్న బ్యాంకు అధికారులు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన సీబీఐ అధికారులు పరుచూరి కుమార్ అలియాస్, అతని భార్య పోకల పల్లవి, ఎస్‌బీఐ అధికారి రవూఫ్‌ పాషా, న్యాయవాదులు ఉమాపతిరావు, హరిహర్ బాబుపై కేసు నమోదు చేశారు. 

వందల కోట్ల చీటింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?