హైదరాబాద్‌లో సీబీఐ సోదాల కలకలం.. ప్రముఖ డాక్టర్ ఇంట్లో అధికారుల తనిఖీలు..

Published : Jan 07, 2023, 11:40 AM IST
హైదరాబాద్‌లో సీబీఐ సోదాల కలకలం.. ప్రముఖ డాక్టర్ ఇంట్లో అధికారుల తనిఖీలు..

సారాంశం

హైదరాబాద్‌‌లో సీబీఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. అజంపురలోని ప్రముఖ డాక్టర్ అంజూమ్ సుల్తానా ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

హైదరాబాద్‌‌లో సీబీఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. అజంపురలోని ప్రముఖ డాక్టర్ అంజూమ్ సుల్తానా ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంజూమ్ సుల్తానా భర్త నిర్వహిస్తున్న వ్యాపారాలపై కూడా అధికారులు సోదాలు జరుపుతున్నారు.బ్యాంక్ లోన్ ఎగొట్టిన అంశంపై ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అంజూమ్ సుల్తానా భర్త కొన్నేళ్ల క్రితం ఆటో మొబైల్ షోరూమ్ నిర్వహించారు. ఆ సమయంలో బ్యాంకులో లోన్ తీసుకున్నారని.. ఆ తర్వాత దాని ఎగొట్టడంతో సదరు బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. ఈ సోదాలు చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : మరో అల్పపీడనం రెడీ .. ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు
Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం