పార్లమెంటూ అతీతం కాదు: క్యాస్టింగ్ కౌచ్ పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్య

First Published Apr 24, 2018, 2:59 PM IST
Highlights

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ కోరియాగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెసు నేత రేణుకా చౌదరి స్పందించారు.

న్యూఢిల్లీ: చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ కోరియాగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెసు నేత రేణుకా చౌదరి స్పందించారు. క్యాసింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదని, అంతటా ఉందని ఆమె అన్నారు. ఇది చేదు నిజమని ఆమె అన్నారు. 

క్యాస్టింగ్ కౌచ్ విషయంలో పార్లమెంటు అతీతమని భావించవద్దని సంచనల వ్యాఖ్య చేశారు. ఈ విషయంపై దేశమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని ఆమె సూచించారు. గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై వాడి వేడి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. 

క్యాస్టింగ్ కౌచ్ పై సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సినీ పరిశ్రమ వాడుకుని వదిలేయడం లేదు కదా, ఎవరు కూడా అత్యాచారం చేసి వదిలేయడం లేదు కదా, క్యాస్టింగ్ కౌచ్ వల్ల కొంత మందికి జీవనోపాధి కలుగుతోందని సరోజ్ ఖాన్ అన్నారు. 

క్యాస్టింగ్ కౌచ్ ను అత్యాచారంతో పోల్చి చేసిన ఆమె వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీంతో ఆమె క్షమాపణ చెప్పారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను శ్రీరెడ్డి కూడా ఖండించారు.

click me!