ప్లీనరీ అనుమతిస్తేనే.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్..

First Published Apr 23, 2018, 1:38 PM IST
Highlights

తేల్చిచెప్పిన కేసీఆర్

జాతీయ స్థాయిలో పీపుల్స్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు టీఆర్‌ఎస్‌ అత్యున్నత ప్రతినిధుల సభ(ప్లీనరీ) అనుమతి తీసుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ నిర్ణయించారు. ప్లీనరీ ఆమోదం లభించిన తర్వాత ఫ్రంట్‌ కసరత్తును వేగవంతం చేయాలని  ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈనెల 27న టీఆర్‌ఎస్‌ 17వ ఆవిర్భావ దినం సందర్భంగా కొంపల్లిలో పార్టీ ప్లీనరీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్లీనరీలోనే ఫెడరల్ ఫ్రంట్ గురించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఈ ఫ్లీనరీకి 31 జిల్లాల నుంచి 15వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. జాతీయ రాజకీయాలు, వ్యవసాయ పెట్టుబడి పథకం ప్రధాన అజెండాలుగా సభ నిర్వహించే అవకాశం ఉంది. ప్రతినిధుల సభ ఆమోదిస్తేనే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని, లేకపోతే లేదని కూడా కేసీఆర్‌ ఈ సందర్భంగా చెప్పే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు తెలిపారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం, పీపుల్స్‌ ఫ్రంట్‌ ఏర్పా టు ఆవశ్యకతను ఆయన వివరించనున్నారు. 

అలాగే ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పీపుల్స్‌ ఫ్రంట్‌ ఏర్పాటు, దాని విధివిధానాల కోసం చేసిన ప్రయత్నాలు, కసర త్తు, కోల్‌కతా, బెంగళూరు పర్యటన వివరాలను కూడా ప్లీనరీ దృష్టికి తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు..ప్లీనరీ వేదికగా ఆమోదించే తీర్మానాలపై సంబంధితకమిటీ తుది కసరత్తు చేస్తోంది. తీర్మానాల సంఖ్య పరిమితం గా, సమగ్రంగా ఉండాలని కేసీఆర్‌ బాధ్యులను ఆదేశించారు. వ్యవసాయం, సంక్షేమం, విద్య, వై ద్యం వంటి వాటి అనుబంధ రంగాలను ఒకే తీర్మానం కింద చేర్చాలా? వేర్వేరు తీర్మానాలుగా ప్రతిపాదించాలా? అనే విషయంలో తర్జనభర్జన జరుగుతోంది.
 

click me!