మరో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసు నమోదు...

By Arun Kumar PFirst Published Nov 23, 2018, 4:59 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడి టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కూటమి బాగస్వామ్య పక్షం టిడిపికి పోలీస్ కేసుల రూపంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వర రావు తనపై వున్న కేసులను ఈసీకి సమర్పించిన నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని ఓ మహిళ ఆరోపిస్తూ ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కు ఫిర్యాదు చేసిన విషయం  తెలిసిందే. నామా నామినేషన్ ను తిరస్కరించి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 

ఈ కేసు గురించి అటుంచితే తాజాగా మరో ఎమ్మెల్యే అభ్యర్ధిపై పోలీసులు పోర్జరీ కేసు నమోదు చేయడంతో తెలంగాణ టిడిపిలో కలకలం సృష్టిస్తోంది. ఆ పార్టీ ఇబ్రహీంపట్నం అభ్యర్థి సామ రంగారెడ్డి పోర్జరీ పత్రాలతో తన భూమిని ఆక్రమించుకున్నాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాంపల్లి సబ్‌రిజిస్టర్ ఆఫీసు ద్వారా పోర్జరీ పత్రాలు సృష్టించి కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో మాదాపూర్ పోలీసులు 420,468,471 సెక్షన్ల కింద సామపై కేసు నమోదు చేశారు.  

మహాకూటమి తరపున పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించుకుని టీఆర్ఎస్ కు షాకివ్వాలని టిడిపి భావిస్తోంది. అందుకోసం ఎన్నో వడపోతల తర్వాత తమ  అభ్యర్థులను ప్రకటించింది. ఇలాంటిది ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తమ అభ్యర్థులు కేసుల్లో చిక్కుకోవడంతో టిటిడిపిలో ఆందోళన మొదలైంది.  

 మరిన్ని వార్తలు

ఎన్నికల్లో పోటీకి నామా అనర్హుడు...తహశీల్దార్‌కు మహిళ ఫిర్యాదు
 
click me!