రాజేంద్రనగర్: గురుశిష్యుల మధ్య హోరాహోరీ

By narsimha lodeFirst Published Nov 23, 2018, 4:48 PM IST
Highlights

రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గురు శిష్యుల మధ్య పోటీ నెలకొంది.


హైదరాబాద్: రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గురు శిష్యుల మధ్య పోటీ నెలకొంది. తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శిష్యుడు గణేష్ గుప్తా  టీడీపీ మధ్య రసవత్తర పోటీ నెలకొంది.

రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి  2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రకాష్ గౌడ్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల సమయంలో  కూడ రాజేంద్రనగర్ నుండి ప్రకాష్ గౌడ్ మరోసారి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత   ప్రకాష్ గౌడ్  ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.  దీంతో ఈ దఫా ప్రకాష్ గౌడ్ ఈ ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకాష్ గౌడ్  టీఆర్ఎస్ అభ్యర్థిగా  బరిలోకి దిగాడు. 

ప్రకాష్ గౌడ్ టీడీపీని వీడడంతో రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుండి గణేష్ గుప్తాను  టీడీపీ   బరిలోకి దింపింది.   ప్రకాష్ గౌడ్ శిష్యుడుగా గణేష్ గుప్తా ఉండేవాడు.  ప్రకాష్ గౌడ్  వెంట టీడీపీ కార్యక్రమాల్లో గణేష్ గుప్తా  పాల్గోనేవాడు.

 ప్రకాష్ గౌడ్ టీడీపీని వీడిన సమయంలో గణేష్ గుప్తా పార్టీని వీడలేదు. పార్టీని బలోపేతం చేసేందుకు గణేష్ గుప్తా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రాజేంద్రనగర్ సీటు గణేష్ గుప్తాకు  టీడీపీ కేటాయించింది.

బీజేపీ నుండి బద్దం బాల్ రెడ్డి ఈ స్థానం నుండి  పోటీ చేస్తున్నారు.  అయితే  కాంగ్రెస్ పార్టీ టీడీపీకి మద్దతుగా నిలిచింది.  సబిత ఇంద్రారెడ్డి తనయుడు  కార్తీక్ రెడ్డి కి కాంగ్రెస్ అగ్రనేత  అహ్మద్ పటేల్  హమీ ఇచ్చారు. దీంతో కార్తీక్ రెడ్డి టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గురు శిష్యుల మధ్య పోటీలో  ఎవరు పై చేయిగా నిలుస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

సంబంధిత వార్తలు

సబిత ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డికి అహ్మద్ పటేల్ బంపర్ ఆఫర్

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు

click me!