హెచ్ఆర్‌సీ ఆదేశాలు:రఘునాథపల్లి ఎస్ఐపై కేసు

Published : Dec 13, 2020, 11:29 AM IST
హెచ్ఆర్‌సీ ఆదేశాలు:రఘునాథపల్లి ఎస్ఐపై కేసు

సారాంశం

ఉమ్మడి వరంగల్ జిల్లా రఘునాథపల్లి ఎస్ఐపై అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  రామ్మూర్తి అనే వ్యక్తి హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు  ఎస్ఐ ఆశోక్ తో పాటు 11 మందిపై కేసు నమోదైంది.రఘునాథపల్లి ఎస్ఐపై కంచనపల్లికి చెందిన రామ్మూర్తి అనే వ్యక్తి  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 


వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రఘునాథపల్లి ఎస్ఐపై అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  రామ్మూర్తి అనే వ్యక్తి హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు  ఎస్ఐ ఆశోక్ తో పాటు 11 మందిపై కేసు నమోదైంది.రఘునాథపల్లి ఎస్ఐపై కంచనపల్లికి చెందిన రామ్మూర్తి అనే వ్యక్తి  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 

తాను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా తననే ఎస్ఐ బెదిరించాడని రామ్మూరి ఆరోపిస్తున్నాడు.  ఈ విషయమై తనకు న్యాయం జరగకపోడంతో హెచ్ఆర్‌సీని ఆశ్రయించినట్టుగా రామ్మూర్తి ప్రకటించారు.

 కోర్టు ఆదేశాల మేరకు  స్థానిక ఎస్ఐతో పాటు మరో 11 మందిపై కేసు నమోదైంది. తాను పనిచేస్తున్న రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ లోనే ఆశోక్ పై కేసు నమోదైంది.

తాను హెచ్ఆర్‌సీని ఆశ్రయించడంతోనే న్యాయం జరిగిందని భావిస్తున్నానని రామ్మూర్తి చెప్పారు. హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే ఎస్ఐ ఆశోక్ పై కేసు నమోదు కావడం గమనార్హం.


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక ఊపిరి పీల్చుకొండి.. తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గేది ఎప్పట్నుంచో తెలుసా?
Kalvakuntla Kavitha Slams Government Over Regional Ring Road Land Acquisition | Asianet News Telugu