తెలంగాణ కరోనా అప్ డేట్: తాజా కేసుల్లో ఆ మూడు జిల్లాలే టాప్

Arun Kumar P   | Asianet News
Published : Dec 13, 2020, 09:27 AM ISTUpdated : Dec 13, 2020, 09:40 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజా కేసుల్లో ఆ మూడు జిల్లాలే టాప్

సారాంశం

తెలంగాణ రాష్ట్రం మెల్లిమెల్లిగా కరోనా కోరల్లోంచి బయటపడుతోంది. గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా వుంటోంది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గింది. గతంలో వేలల్లో నమోదయిన కేసులు కొద్ది రోజులుగా కేవలం వందల్లో నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో (శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 47,186మందికి టెస్టులు చేయగా కేవలం 573మందికి మాత్రమే పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 61,28,703కి చేరితే మొత్తం కేసుల సంఖ్య 2,77,724కి చేరింది. 

రాష్ట్రంలో ఇటీవల టెస్టుల సంఖ్య పెరిగినా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.  ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 609 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,68,601కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 7,630 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో  నలుగురు మాత్రమే మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1493కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 94.9శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 96.71శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి జిల్లాలో కేసులేవి నమోదుకాలేదు. అలాగే ఆదిలాబాద్ 7, కామారెడ్డి 5, నారాయణ పేట 4, భూపాలపల్లి 7, జనగామ 7, జగిత్యాల 9, జోగులాంబ గద్వాల 1, అసిఫాబాద్ 5, మహబూబ్ నగర్ 9, మహబూబాబాద్ 6, మెదక్ 6, నాగర్ కర్నూల్ 6,  నిర్మల్ 6, నిజామాబాద్ 8,  సిరిసిల్ల 7, వికారాబాద్ 3, వరంగల్ రూరల్ 9 అతి తక్కువ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 127కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 67, రంగారెడ్డి 58, భద్రాద్రి కొత్తగూడెం 19, కరీంనగర్ 22, ఖమ్మం 33,  మంచిర్యాల 12, ములుగు 11, నల్గొండ 12,పెద్దపల్లి 13,  సంగారెడ్డి 17, సూర్యాపేట 14, వరంగల్ అర్బన్ 33, సిద్దిపేట 15, యాదాద్రి 15 కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 

   

PREV
click me!

Recommended Stories

First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?
Cyclone Alert : బలపడుతోన్న అల్పపీడనం, తుపాన్ లోడింగ్? ఈ 9 జల్లాల్లో కుండపోత వర్షాలతో అల్లకల్లోలమే