జయరాం హత్య: శిఖా చౌదరిపై కేసు నమోదు

Published : Feb 26, 2019, 06:51 AM IST
జయరాం హత్య: శిఖా చౌదరిపై కేసు నమోదు

సారాంశం

అక్రమంగా చొరబడినందుకు గాను సంబంధిత సెక్షన్‌ కింద శిఖా చౌదరి, ఆమె స్నేహితుడు సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యాయపరమైన సలహా తీసుకొని శిఖాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్: హత్యకు గురైన ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖాచౌదరిపై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జయరాం హత్య తరువాత ఆయన ఇంట్లోకి అక్రమంగా చొరబడి విలువైన పత్రాలు, ఆభరణాలు తీసుకెళ్లిందని జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. 


దాంతో అక్రమంగా చొరబడినందుకు గాను సంబంధిత సెక్షన్‌ కింద శిఖా చౌదరి, ఆమె స్నేహితుడు సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యాయపరమైన సలహా తీసుకొని శిఖాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
జయరాం హత్యకేసులో సుభాష్‌రెడ్డి అనే వ్యక్తి పేరు కొత్తగా రావండంతో ఆయనను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. 

జయరాం హత్య తర్వాత రాకేష్‌రెడ్డి సుభాష్‌రెడ్డికి ఫోన్ చేశాడు. మంగళవారం (రేపు) బంజారాహిల్స్‌ ఏసీపీ నిందితులు నగేష్‌, విశాల్‌, సుభాష్‌లను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays: కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
TG Police Recruitment 2026: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఎంత? జీతం, క్వాలిఫికేషన్, నెగెటివ్ మార్కింగ్ ఫుల్ డీటైల్స్