రాజకీయ ఒత్తిళ్లతోనే నాపై కేసులు: ఈడీ విచారణకు హాజరైన నౌహీరా షేక్

By narsimha lodeFirst Published Dec 27, 2022, 3:51 PM IST
Highlights

రాజకీయ ఒత్తిళ్లతోనే  తనపై అక్రమంగా  కేసులు నమోదు చేయించారని హీరా గ్రూప్ సంస్థల అధినేత  నౌహీరా షేక్ ఆరోపించారు. 

హైదరాబాద్: తమ  సంస్థ లో పెట్టబుడిదారులకు న్యాయం చేస్తానని హీరా గ్రూప్  సంస్థ అధినేత  నౌహీరా షేక్  ప్రకటించారు.మంగళవారంనాడు  నౌహీరా షేక్  ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. హీరా గ్రూప్ లో పెట్టుబడిదారులను ఎవరిని మోసం చేయలేదనప్నారు. ఈ కేసులో  విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నానని ఆమె చెప్పారు.  డిపాజిట్ దారులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. తన సంస్థలో పెట్టుబడులు పెట్టినవారికి  రెండు రెట్లు అదనంగా  చెల్లించనున్నట్టుగా  నౌహీరా షేక్  ప్రకటించారు. ఇప్పటివరకు  డిపాజిటర్లకు  చెల్లించిన వివరాలు ఈడీకి  సమర్పించినట్టుగా ఆమె వివరించారు.  ఇకపై తన ఇన్వెస్టెర్లతో  కలిసి వ్యాపారం  కొనసాగిస్తానన్నారు. తాను  పార్టీని  ప్రకటించిన మూడు రోజుల్లోనే అరెస్టైనట్టుగా  నౌహీరా షేక్  తెలిపారు.  అరెస్టులు, బెదిరింపులకు నేను భయపడనన్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే  తనపై కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు.  

హీరా గ్రూప్ నకు చెందిన  ఆస్తులను ఈడీ అధికారులు  జప్తు చేశారు. ఈ  విషయమై  సుప్రీంకోర్టు  నౌహీరా షేక్  సుప్రీంకోర్టులో సవాల్  చేశారు.  ఈ కేసులో  నౌహీరా షేక్ కు అనుకూలంగా  కోర్టు  ఆదేశాలు   జారీ చేసింది.  ఈ ఆదేశాలకు సంబంధించిన పత్రాలను  ఇవాళ ఈడీ అధికారులకు  నౌహీరా షేక్ అందించారు. డిపాజిట్ దారులనుండి  సుమారు  రూ. 5 వేల కోట్లను  సేకరించారని నౌహీరా షేక్  పై ఆరోపణలున్నాయి.  ఈ డిపాజిట్ దారులకు  సకాలంలో  డబ్బులు చెల్లించలేదని ఆరోపణలున్నాయి.  2018లో  నౌహీరా షేక్ పై  ఈడీ అధికారులు  కేసు నమోదు చేశారు. 

also read:నౌహీరా కేసులో కీలక మలుపు... రియల్ ఎస్టేట్ సంస్థలకు స్థలాల విక్రయాలు, ఈడీ సోదాల్లో వెలుగులోకి

రియల్ ఏస్టేట్ సంస్థలకు నౌహీరా షేక్  భూములు విక్రయించారని  ఈడీ అధికారులు గుర్తించారు.  ఈ ఏడాది నవంబర్ మాసంలో  ఈడీ అధికారులు  పలు రియల్ ఏస్టేట్  సంస్థల్లో  సోదాలు నిర్వహించిన సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. మహారాష్ట్ర షోలాపూర్ లోని  సత్వా రియల్ ఏస్టేట్  కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సమయంలో   నౌహీరా షేక్ తో  సంబంధాలు  వెలుగు చూసిన విషయం తెలిసిందే.
 

 

click me!