హైద్రాబాద్ వనస్థలిపురంలో కారు బీభత్సం సృష్టించింది. బైకర్ ను ఢీకొట్టి హోటల్‌లోకి దూసుకెళ్లింది కారు.
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో శుక్రవారం నాడు కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టింది. వేగం అదుపు కాకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న హోటల్ లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.
గతంలో కూడ హైద్రాబాద్ నగరంలో రోడ్డు పక్కన ఉన్నదుకాణాల్లోకి కార్లు, ఇతర వాహనాలు దూసుకెళ్లిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 2020 ఫిబ్రవరి 23న హైద్రాబాద్ బంజారాహిల్స్ లో కారు అదుపుతప్పి హోటల్ లో కి దూసుకెళ్లింది. అతివేగంతో కారును నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న హోటల్ లోకి వెళ్లి. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుండి పంజాగుట్ట వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారును నడిపినట్టుగా పోలీసులు అప్పట్లో గుర్తించారు. కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఈ కారులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు.
2020 ఫిబ్రవరి మాసంలో రెండు వాహనాలను ఢీకొట్టిన కారు రోడ్డు పక్కనే ఉన్న హోటల్ లోకి దూసుకెళ్లింది, ఈ ఘటన హైద్రాబాద్ మియాపూర్ లో జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణులున్నాయి
అతివేగం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. మరో వైపు మద్యం సేవించి వాహనాలు నడపడం కూడా ఈ తరహ ప్రమాదాలకు కారణమనే అభిప్రాయాలు నెలకొన్నాయి.