సంగారెడ్డి జిల్లా, బీరంగూడలో ఆగి ఉన్న డీసీఎంలో మంటలు చెలరేగి.. డీసీఎంతో సహా కారు, మినీ బస్సు కూడా దగ్థం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. పఠాన్ చెరు బీరంగూడలో ఆగి ఉన్న డీసీఎంలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో డీసీఎం, కారు, ఓ మినీబస్సులు వరుసగా పార్క్ చేసి ఉన్నాయి. డీసీఎంలో చెలరేగిన మంటలు.. కారు, మినీబస్సుకు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
డీసీఎంలో ఓ రకమైన మంటలను ప్రేరేపించే ద్రావణం ఉండడం.. అది కారడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. అయితే, మూడు వాహనాలు ఆగి ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాద గురించి తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు.
అగ్ని ప్రమాదంలో మూడు వాహనాలు పూర్తిగా దగ్థం అయ్యాయి. కానీ ఎవ్వరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంనటే.. మినీ బస్సులో ఉన్నవారిని రక్షించడానికి స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.