ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశ ద్రోహం కేసుపై కేసీఆర్ స్పందించాలి: నారాయణ

By narsimha lode  |  First Published Jun 16, 2023, 4:07 PM IST

ప్రొఫెసర్  హరగోపాల్ పై దేశద్రోహం  కేసు పెట్టడాన్ని  సీపీఐ  జాతీయ  కార్యదర్శి నారాయణ  ఖండించారు. ఈ విషయమై  కేసీఆర్ స్పందించాలని ఆయన  కోరారు.


హైదరాబాద్: ప్రొఫెసర్ హరగోపాల్ పై  దేశద్రోహం  కేసు పెట్టడం సరైంది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  అన్నారు . హరగోపాల్ పై కేసు పెట్టడాన్ని  ఖండించారు  సీపీఐ జాతీయ కార్యదర్శి.  తెలంగాణ ఉద్యమంలో  హరగోపాల్ పనిచేశారని ఆయన గుర్తు  చేశారు.  హరగోపాల్ పై  నమోదైన  దేశద్రోహం కేసుపై  కేసీఆర్ స్పందించాలని ఆయన డిమాండ్  చేశారు. వరవరరావుపై  కూడ ఇలానే  దేశద్రోహం కేసు పెట్టారని ఆయన గుర్తు  చేశారు.   కేసీఆర్, జగన్ ,చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే బీహార్ లో విపక్షాల  సమావేశానికి సహకరించాలని ఆయన  కోరారు.

2022 ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో  ప్రొఫెసర్ హరగోపాల్ పై  పోలీసులు కేసు నమోదు చేశారు.ఉపాతో పాటు  పలు సెక్షన్ల కింద  కేసులు పెట్టారు.ప్రజా ప్రతినిధులు  చంపేందుకు  కుట్ర చేశారని  పోలీసులు ఆరోపిస్తున్నారు.  మావోయిస్టుల  పుస్తకాల్లో హరగోపాల్  పేరుందని  పోలీసులు ఎఫ్ఐఆర్ లో  పేర్కొన్నారు. 

Latest Videos

undefined

also read:ప్రొ.హరగోపాల్‌పై దేశద్రోహం కేసు .. బెయిల్ పిటిషన్‌తో వెలుగులోకి, మరో 152 మందిపైనా అభియోగాలు

ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరి  కలెక్టర్  వినీల్ కృష్ణను గతంలో మావోయిస్టులు  కిడ్నాప్  చేశారు. కలెక్టర్ వినీల్ కృష్ణను విడుదల చేయించడంలో  మావోయిస్టులతో  చర్చలకు మధ్యవర్తిగా అప్పట్లో హరగోపాల్ వ్యవహరించారు. వినీల్ కృష్ణ విడుదలలో  హరగోపాల్ కీలకంగా వ్యవహరించారు. ప్రొఫెసర్  హరగోపాల్  పౌరహక్కుల ఉద్యమంలో  కీలకంగా పనిచేశారు.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  హరగోపాల్  హక్కుల ఉద్యమంలో  కీలకంగా వ్యవహరించారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో  ఆయన కీలకంగా వ్యవహరించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో హరగోపాల్  చురుకుగా  పాల్గొన్నారు. 

 


 

click me!