ముల్కనూరులో ఎట్టకేలకు బయటపడ్డ కారు.. లోపల మృతదేహం, రిటైర్డ్ ఎస్సైగా గుర్తింపు

Siva Kodati |  
Published : Jul 29, 2021, 08:54 PM IST
ముల్కనూరులో ఎట్టకేలకు బయటపడ్డ కారు.. లోపల మృతదేహం, రిటైర్డ్ ఎస్సైగా గుర్తింపు

సారాంశం

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మల్కనూరు వద్ద బావిలోకి  దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశారు. బయటపడిన మృతదేహాన్ని భీమదేవరపల్లి మండలానికి చెందిన రిటైడ్ ఎస్సై పాపయ్య నాయక్‌గా గుర్తించారు. 

గురువారం ఉదయం కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మల్కనూరు వద్ద బావిలోకి  దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశారు. బావిలో దాదాపు 60 అడుగుల మేర నీరు ఉండటంతో కారును బయటకు తీయడం  అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కష్టంగా మారింది. సుమారు 8 గంటల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. కారు అద్దాలు తెరచి చూడగా.. కారులో ఒక్కరే ఉన్నట్టు గుర్తించారు. కారు కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బయటపడిన మృతదేహాన్ని భీమదేవరపల్లి మండలానికి చెందిన రిటైడ్ ఎస్సై పాపయ్య నాయక్‌గా గుర్తించారు. 
 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం