ఎస్సారెస్సీ కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు...ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు

Arun Kumar P   | Asianet News
Published : Feb 10, 2021, 11:40 AM ISTUpdated : Feb 10, 2021, 11:46 AM IST
ఎస్సారెస్సీ కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు...ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు

సారాంశం

వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లగా... ఆ నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. 

వరంగల్: తెల్లవారుజామున వేగంగా వెళుతున్న ఓ కారు నీటి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. కాలువ నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో కారును కెనాల్ నుండి బయటకు లాగారు. గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టారు. 

ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తెలుస్తోంది. అతివేగంతో వెళుతున్న కారు అదుపుతప్పడం వల్లే కారు కెనాల్ లోకి దూసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం  వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో ఎస్సారెస్పీ కెనాల్ లో చోటుచేసుకుంది. 

కారు ప్రమాదంలో గల్లంతయిన వారి వివరాలు తెలియాల్సి వుంది. ఓ వైపు కాలువలో మృతదేహాలను గాలిస్తూనే మరోవైపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే లభించిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం