విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

Published : Jan 16, 2019, 02:13 PM ISTUpdated : Jan 16, 2019, 02:14 PM IST
విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

సారాంశం

సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో టైరు పేలడంతో అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో బాలుడు కొర ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు ఓ కారు వేగంగా ప్రయాణిస్తోంది. ఇలా కారు మంచి స్పీడులో వెళుతుండగా కోదాడ పట్టణ శివారులోని కోమరబండ కూడలి వద్దకు రాగానే టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్నవ్యక్తికి కారును అదుపుచేయడం సాధ్యం కాక ముందు వెళుతున్న రెండు కార్లను ఢీకొట్టిన బోల్తా పడింది. 

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో బాలుడు తీవ్రంగా  గాయపడ్డారు. స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  
 
PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy: 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
Strong Wind Alert : వాయుగుండం కాదిది వాయు'గండం'.. ప్రచండ గాలులతో ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే