
హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ నేతలు సమావేశం కావడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర ట్వీట్ చేశారు. బుధవారం నాడు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని అసద్ వ్యక్తం చేశారు.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు బుధవారం నాడు భేటీ అయ్యారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర ట్వీట్ చేశారు.
కేసీఆర్ ట్రంప్ కార్డుగా ఉన్న రైతు బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకోనుందన్నారు. అయితే ఈ తరుణంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల సీఎం ఏం చేస్తారనే దానికి ఇదే ఒక ఉదహరణ అంటూ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఏం ఇస్తారో చూస్తామని చంద్రబాబునాయుడు కూడ స్పందించిన విషయం తెలిసిందే. ఏపీలో తాను జగన్‌కు మద్దతుగా నిలుస్తానని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.