భగవంతుడి దయతో బాగానే ఉన్న.. వారం రోజుల్లో ప్రజల్లోకి వస్తా - కొత్త ప్రభాకర్ రెడ్డి

Published : Nov 03, 2023, 12:19 PM IST
భగవంతుడి దయతో బాగానే ఉన్న.. వారం రోజుల్లో ప్రజల్లోకి వస్తా - కొత్త ప్రభాకర్ రెడ్డి

సారాంశం

భగవంతుడి దయ వల్ల బాగానే ఉన్నానని, తనను చూసేందుకు హాస్పిటల్ కు వచ్చి ఎవరూ ఇబ్బంది పడకూడదని ఎంపీ కొత్త ప్రభాకరెడ్డి కోరారు. మరో వారం రోజుల్లో ప్రజల్లోకి వస్తానని స్పష్టం చేశారు. 

ఎన్నికల ప్రచార సమయంలో కత్తి దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోలుకుంటున్నారు. బీఆర్ఎస్ తరుఫున దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆయన మరో వారం రోజుల్లో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడతానని వెల్లడించారు. తన కోసం ఎవరూ హాస్పిటల్ కు రావొద్దని సూచించారు. ఈ మేరకు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన వీడియోను ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో విడుదల చేశారు.

‘‘భగవంతుని ఆశీస్సులతో, మీ ఆశీర్వాదంతో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాను. కొద్దీ రోజుల్లోనే మీ ముందుకి తిరిగి వస్తాను. 
దయచేసి నన్ను చూడడానికి హాస్పిటల్ కి వచ్చి మీరు ఇబ్బంది పడకండి..’’ అని అందులో వెల్లడించారు. గత నెల 30వ తేదీన ఆయన కత్తి దాడిలో గాయపడ్డారు. సిద్దిపేట జిల్లా సూరంపల్లి గ్రామంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా కలకం రేకెత్తించింది. 

PREV
click me!