ఆ జైలులో ఉరి తాళ్ల తయారి: నిర్భయ నిందితుల కోసమేనా

By Siva KodatiFirst Published Dec 9, 2019, 5:19 PM IST
Highlights

ఈ వారాంతం నాటికి 10 ఉరి తాళ్లు తయారు చేసి సిద్ధంగా ఉంచాల్సిందిగా బక్సార్ జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. 

బీహార్‌లోని బక్సార్ జైలు ఉరితాళ్లను తయారు చేయడంలో పెట్టింది పేరు. దేశంలో ఎక్కడ ఉరి శిక్షను అమలు చేయాల్సి వచ్చినా ఈ జైలుకే ఆర్డర్ ఇస్తారు. తాజాగా ఈ వారాంతం నాటికి 10 ఉరి తాళ్లు తయారు చేసి సిద్ధంగా ఉంచాల్సిందిగా బక్సార్ జైలు అధికారులకు ఆదేశాలు అందాయి.

అయితే దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన నిర్భయ హంతకుల కోసమే ఈ ఉరితాళ్లను తయారు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై బక్సార్ జైలు సూపరిండెంట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్ 14 నాటికి 10 ఉరితాళ్లను తయారు చేసి ఉంచాలని తమకు ఆదేశాలు అందాయని తెలిపారు.

Also Read:వాళ్లు క్షమాభిక్షకు అనర్హులు: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు

అయితే ఇవి ఎక్కడికి తరలిస్తారనే దానిపై తమకు సమాచారం లేదని ఆరోరా స్పష్టం చేశారు. కాగా ఒక్క ఉరితాడును తయారు చేయడానికి 3 గంటల సమయం పడుతుందని... బక్సార్ జైలులో ఉరితాళ్లను తయారు చేయడంలో సిద్ధహస్తులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

2001 పార్లమెంట్‌పై దాడి జరిపిన ప్రధాన నిందితుడు అఫ్జల్ గురును ఉరి తీసేందుకు కూడా ఉరి తాడును ఇక్కడి నుంచే పంపించారు. 2012లో దేశ రాజధానిలో ఓ వైద్య విద్యార్ధిని నిర్భయపై కదులుతున్న బస్సులో దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది.

Also read:ఏడుగురి సజీవ దహనం: ఖైదీకి క్షమాభిక్షకు నో చెప్పిన రాష్ట్రపతి

వీరు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోగా ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో నలుగురు రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోగా... ఇందుకు అంగీకరించవద్దని దేశాధ్యక్షుడికి కేంద్ర హోంశాఖ సిఫారసు చేసింది.

ఇదే సమయంలో నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ తాను క్షమాభిక్ష పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు. తనకు ఇంకా చట్టపరమైన అవకాశాలు ఉన్నాయని, సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేస్తానని పేర్కొన్నాడు. 


 

click me!