
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని పాతబస్తీకి చెందిన వ్యాపారి మధుసూదన్ రెడ్డిని అతని మిత్రులే కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ నెల 19వ తేదీన మధుసూదన్ రెడ్డి కిడ్నాపయ్యారు.ఈ విషయమై ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మధుసూదన్ రెడ్డి తన మిత్రులకు రూ. 40 లక్షలను అప్పుగా ఇచ్చారు. ఈ డబ్బులను తిరిగి ఇవ్వాలని మిత్రులను కోరాడు. అయితే ఈ డబ్బులు తిరిగి ఇవ్వని మిత్రులు అతడిని హత్య చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఈ నెల 19వ తేదీన మధుసూదన్ రెడ్డిని మిత్రులే పథకం ప్రకారంగా కిడ్నాప్ చేశారు. చార్మినార్ నుండి అతడిని సంగారెడ్డికి తీసుకెళ్లారు. అక్కడే అతడిని హత్య చేశారు. మృతదేహన్ని ఓ పొలంలో పూడ్చిపెట్టారు.
ఈ హత్యలో పాల్గొన్న ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ హత్యలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.