ప్రియురాలు, స్నేహితులు మోసం చేశారు: ఫేస్‌బుక్ లైవ్‌లోనే హైద్రాబాద్‌లో యువకుడి సూసైడ్

Published : Aug 22, 2021, 10:08 AM IST
ప్రియురాలు, స్నేహితులు మోసం చేశారు: ఫేస్‌బుక్ లైవ్‌లోనే హైద్రాబాద్‌లో యువకుడి సూసైడ్

సారాంశం

ప్రేమించిన యువతితో పాటు స్నేహితులు మోసం చేశారని  బ్రహ్మం అనే వ్యక్తి లాడ్జీలో ఫేస్ బుక్ లైవ్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన హైద్రాబాద్ వనస్థలిపురంలో చోటు చేసుకొంది. మృతదేహన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  


హైదరాబాద్:  ప్రేమించి మోసపోయాయని ఓ యువకుడు  ఫేస్‌బుక్ లైవ్‌లో  ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైద్రాబాద్‌ వనస్థలిపురంలో చోటు చేసుకొంది.ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన  షేక్ బ్రహ్మం  లారీ యజమాని. ఆయనకు భార్య ఖాసీంబీ, కొడుకు , కుమార్తెలున్నారు.  ఆర్ధికంగా అతను  నష్టపోయాడు. 

శనివారం నాడు స్నేహితుడు వేణుగోపాల్‌తో  కలిసి వనస్థలిపురం వీఎంఆర్ లాడ్జ్ బార్‌లో గది అద్దెకు తీసుకొన్నారు. మధ్యాహ్నం ఇద్దరు కలిసి మద్యం తాగారు. మధ్యాహ్నం  లాడ్జిలో పడుకొన్నారు. సాయంత్రం మళ్లీ బార్ లో   సాయంత్రం స్నేహితుడితో కలిసి బ్రహ్మం మద్యం తాగారు. ఈ సమయంలో తాను  లాడ్జీ గదికి వెళ్లి వస్తానని స్నేహితుడు వేణుగోపాల్ కు చెప్పారు.

గదికి వెళ్లిన బ్రహ్మం ఫేస్‌బుక్ లైవ్‌లో  మాట్లాడారు. తనను ప్రేమించిన యువతి తనను మోసం చేసిందని ఫేస్ బుక్ లైవ్ లో పేర్కొన్నాడు. అంతేకాదు స్నేహితులు కూడా తనను మోసం చేశారని ఆరోపించారు.ఈ లైవ్ ను చూసిన కొందరు స్నేహితులు ఆయనకు ఫోన్ చేశారు. 
కానీ ఆయన ఎంతుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫేస్ బుక్ లైవ్ లోనే ఆయన లుంగీతో ఫ్యాన్ కు ఉరేసుకొన్నాడు. 

మరోవైపు బార్ లో ఉన్న స్నేహితుడు వేణుగోపాల్ కు కూడ స్నేహితడు బ్రహ్మంకి ఫోన్ చేశాడు.  కానీ బ్రహ్మం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆయన  లాడ్జీలో గదికి వెళ్లాడు. డోర్ లాక్ చేసి ఉంది. కిటీకీ నుండి లోపలికి చూశాడు.

అప్పటికే బ్రహ్మం ఫ్యాన్ కు ఉరేసుకొన్నాడుద. దీంతో  వేణుగోపాల్ లాడ్జీ సిబ్బందిని పిలిచి  గది తలుపులు తెరిచాడు.  అప్పటికే బ్రహ్మం మరణించాడు.   లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  వనస్థలిపురం పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Renu Desai Angry Over Social Media Comments: నెటిజన్ల బూతు కామెంట్లపై రెచ్చిపోయిన రేణుదేశాయ్
Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu