బుద్వేల్‌లో హెచ్ఎండీఏ భూముల వేలం: పరిశీలనకు వెళ్లిన కోదండరెడ్డి అరెస్ట్

Published : Aug 11, 2023, 11:19 AM IST
బుద్వేల్‌లో  హెచ్ఎండీఏ  భూముల వేలం: పరిశీలనకు వెళ్లిన కోదండరెడ్డి అరెస్ట్

సారాంశం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బుద్వేల్ లో  హెచ్ఎండీఏ భూముల పరిశీలనకు వెళ్తున్న కాంగ్రెస్ నేత కోదండరెడ్డిని  పోలీసులు అరెస్ట్  చేశారు.

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బుద్వేల్ లో  హెచ్ఎండీఏ భూముల పరిశీలనకు  వెళ్తున్న  కాంగ్రెస్ నేతలను  శుక్రవారంనాడు పోలీసులు అడ్డుకున్నారు.  ముందు జాగ్రత్తగా  కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నేతలను  అరెస్ట్  చేశారు  పోలీసులు.  బుద్వేల్ లోని  100 ఎకరాల భూమిని ప్లాట్లుగా  చేసి హెచ్ఎండీఏ విక్రయిస్తుంది.

నిన్నటి నుండి  ఈ భూముల విక్రయాన్ని ప్రారంభించింది.  అయితే  ఇవాళ బుద్వేల్ కు  వెళ్తున్న  కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నేత కోదండరెడ్డి సహా ఆ పార్టీ  నేతలను  పోలీసులు అడ్డుకున్నారు.ఈ సమయంలో  పోలీసులతో కోదండరెడ్డి వాగ్వాదానికి దిగారు.   బుద్వేల్ కు  వెళ్లకుండా  ఎందుకు  అడ్డుకుంటున్నారని కోదండరెడ్డి ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్