తలసరి ఆదాయం ఎలా పెరిగింది, ప్రజలపైనే అప్పుల భారం: అసెంబ్లీలో భట్టి విక్రమార్క

By narsimha lode  |  First Published Feb 8, 2023, 12:38 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా  ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని   సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  చెప్పారు. 



హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  చెప్పారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎలా పెరిగిందో  లెక్కలు  చెప్పాలని  సీఎల్పీ నేత  మల్లు భట్టి విక్రమార్క   ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర బడ్జెట్ పై  బుధవారం నాడు  జరిగిన చర్చలో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  ప్రసంగించారు.   రాష్ట్ర ప్రభుత్వం  రూ. 4.86 లక్షల  కోట్లు అప్పులు చేసిందన్నారు.  ఈ అప్పులను  ఎవరు కట్టాలని  ఆయన ప్రశ్నించారు. అప్పులతో  రాష్ట్ర ప్రజలపై భారం  వేస్తున్నారని  ప్రభుత్వంపై   సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  విమర్శించారు. 

Latest Videos

undefined

ప్రభుత్వ రంగ  సంస్థల్ని  ఇష్టానుసారం విక్రయిస్తున్నారన్నారు. దీంతో  లాభం కంటే  నష్టమే ఎక్కువ అని  భట్టి విక్రమార్క  చెప్పారు.  పేదలకు  స్థలాలు లేవన్నారు.   గతంలో  ప్రభుత్వాలు పేదలకు  ఇచ్చిన  భూములను  వెనక్కి తీసుకుంటున్నారని  సీఎల్పీ నేత ఆందోళన వ్యక్తం  చేశారు.  ఈ పద్దతిని మానుకోవాలని ఆయన ప్రభుత్వానికి  సూచించారు.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ద్రవ్యోల్బణం  పెరిగిపోతుందని  భట్టి విక్రమార్క  విమర్శించారు. మోడీ సర్కార్  తీసుకువచ్చిన  చట్టం కారణంగా   వ్యాపారులు  సరుకులను బ్లాక్  చేసి  ద్రవ్యోల్బణానికి  కారణమౌతున్నారని  ఆయన విమర్శించారు.  గగతంలో  కాంగ్రెస్ సర్కార్  తీసుకు వచ్చిన నిత్యావసర సరుకుల చట్టాన్ని తీసివేయడంతో  ఈ పరిస్థితి  నెలకొందని  భట్టి విక్రమార్క  విమర్శించారు.

విద్వేష రాజకీయాలు  దేశం కోరుకోవడం లేదని  భారత్ జోడో యాత్రలో  రాహుల్ గాంధీ  చెప్పారన్నారు.  అదానీ కంపెనీ ఏం చేసిందో  బయటపడిందన్నారు. అదానీపై  విమర్శలు చేస్తే  దేశంపై  విమర్శలు చేసినట్టుగా మాట్లాడారని  ఆయన పరోక్షంగా బీజేపీపై  వ్యాఖ్యలు  చేశారు.   బడ్జెట్ లో  బీసీలకు  కేటాయించిన రూ. 6 వేల కోట్లు సరిపోవన్నారు. ఈ నిధులను పెంచాలని  సీఎల్పీ నేత ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో  ఇటీవల కాలంలో  ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు పెరిగిపోయాయని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గుర్తు  చేశారు. ప్రశ్నిస్తే కేసులు , దాడులకు పాల్పడుతున్నారన్నారు.  దేశంలో నియంతృత్వం  పెరిగిపోయిందని ఆయన  చెప్పారు. 

రాష్ట్రంలో  ఫీజుల పేరుతో  కార్పోరేట్ విద్యాసంస్థలు  ప్రజల ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే  ఇళ్లు, పొలాలు అమ్ముకొనే  పరిస్థితి నెలకొందని  భట్టి విక్రమార్క  గుర్తు  చేశారు. 

తెలంగాణ రాష్ట్రానికి  కృష్ణా, గోదావరి నదీ జలాల్లో ఎంత వాటా ఇచ్చారని  ఆయన ప్రశ్నించారు.  నీటి వాటాలు లెక్క తేలకపోతే  రాష్ట్రానికి నష్టమని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం  నిర్మిస్తున్న  ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ లను బయటపెట్టాలన్నారు.

click me!