
సిద్దిపేట : తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను అతికిరాతకంగా హత్య చేశారు దుండగులు. తర్వాత ఆమె గొంతు కోశారు. శరీరం నుంచి కాళ్లను వేరు చేశారు. అత్యంత క్రూరమైన ఈ దారుణ హత్య ములుగు మండలం బండమైలారంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి సమాచారం అందడంతో గజ్వేల్ ఏసిపి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
దీనిమీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళను ప్లాస్టిక్ సామాగ్రి అమ్ముతూ జీవించే వెంకటమ్మ (40)గా గుర్తించారు. ఆమెకు వివాహమే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భర్త కొంతకాలం క్రితమే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వెంకటమ్మను ఎవరు హత్య చేశారు? హత్యకు గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కేసీఆర్‌పై పోటీ చేయాలనే ప్రతిపాదన, సత్తా చూపుతాం: కూనంనేని సాంబశివరావు
ఇదిలా ఉండగా, ఈ ఆగస్ట్ 4 వ తేదీన ఇలాంటి దారుణ ఘటనే ఏపీలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఓ టీచర్ ని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు, గత కొంతకాలంగా ఆమె తన ప్రాణానికి ప్రమాదం ఉందని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదని.. ఇప్పుడు ఆమెను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మదనపల్లెలోని బికే పల్లెకు చెందిన రుక్సానా (32) మదనపల్లిలోని శ్రీ జ్ఞానాంబికా జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తుంది. ఆమెకు ఆరేళ్ల కిందట మదనపల్లెలోని శివాజీ నగర్ కు చెందిన ఖదీర్ అహ్మద్ తో వివాహమయ్యింది. అతను వేంపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో డ్యూటీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. వీరికి పెళ్లయిన మూడేళ్ల తర్వాత కూడా పిల్లలు కాలేదు.దీంతో భార్య రుక్సానా అనుమతితో ఖదీర్ అహ్మద్ రెండో పెళ్లి చేసుకున్నాడు.
మదనపల్లెలోని అప్పారావు తోటకు చెందిన ఆయేషాతో వివాహమైంది. కొద్ది రోజులపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కాగా, భర్తకు రెండో పెళ్లి అయిన కొద్ది రోజులకి.. మొదటి భార్య రుక్సానాకి గర్భం వచ్చింది.18 నెలల కిందట ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. భార్యకి కూతురు పుట్టడంతో కదీర్ అహ్మద్ కొద్దికాలంగా ఆమెతోపాటే ఉంటున్నాడు. దీంతో రెండో భార్య గొడవ మొదలు పెట్టింది.
వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మొదటి భార్య రుక్సానా వల్లనే తన భర్త తన దగ్గరికి రావడం లేదని రెండో భార్య అయేషా గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. తనకు అంతకు అంతకుముందే పెళ్లయింది అన్న సంగతి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని… అయేషా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి రుక్సానాతో గొడవకు దిగింది.
మొదటి భార్య ఉండగా తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని అయేషా.. తన భర్త కదిర్ అహ్మద్, మొదటి భార్య రుక్సానా. వారి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిమీద కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలోనే గత రెండు నెలలుగా అయేషా కుటుంబ సభ్యులు, సోదరులు రుక్సానా పనిచేస్తున్న కాలేజ్ దగ్గరికి వెళ్లి రెక్కీ చేశారు. ఈ విషయం రుక్సానాకు తెలియడంతో ఫిబ్రవరి ఒకటో తేదీన టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం తాను పనిచేస్తున్న కాలేజీ నుంచి ఇంటికి టూ వీలర్ మీద వెళుతోంది రుక్సానా. ప్రశాంత్ నగర్ దగ్గర్లో ఇద్దరు యువకులు 2 వీలర్ మీద ఆమె దగ్గరికి వచ్చారు.. ఆమె కళ్ళల్లో కారం కొట్టి, గొంతులో పొడిచారు .కాలేజీ విడిచిన సమయం కావటంతో అటుగా వస్తున్న విద్యార్థులు ఇది చూశారు. వెంటనే వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారు పరారయ్యారు. రుక్సానా గొంతులో పొడవడంతో నరి రోడ్డు మీదే ఆమె కన్నుమూసింది.. ఈ సమాచారం తెలుసుకున్న డీఎస్పీ కేశప్ప, సిఐలు మురళి కృష్ణ మహబూబ్బాషా ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.