సఫాయి కార్మికులతో సహపంక్తి భోజనం ... కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించిన కేటీఆర్

By Arun Kumar P  |  First Published Jan 2, 2024, 10:22 AM IST

తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నూతన సంవత్సర వేడుకలను పారిశుద్ద్య కార్మికులతో కలిపి జరుపుకున్నారు. 


హైదరాబాద్ : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నూతన సంవత్సర వేడుకలను సరికొత్తగా జరుపుకున్నారు. పార్టీలు, సంబరాలతో కాకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా వుంచే పారిశుద్ద్య కార్మికులతో కలిసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు కేటీఆర్. సోమవారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు వచ్చిన పారిశుద్ద్య కార్మికులతో ముచ్చటిస్తూ, సెల్పీలు దిగుతూ సరదాగా గడిపారు కేటీఆర్. అలాగే నూతన సంవత్సరాదిని   పురస్కరించుకుని కార్మికులందరికి కడుపునిండా భోజనం పెట్టారు. పారిశుధ్ద్య కార్మికులతో కలిసి కేటీఆర్ సహపంక్తి భోజనం చేసారు. 
 
పారిశుద్ద్య కార్మికులతో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు కేటీఆర్. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న కేటీఆర్ వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని అన్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ద్వారా కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని కేటీఆర్ తెలిపారు.  

Also Read  న్యూ ఇయర్ సంబరాల్లోనూ పాలిటిక్స్ ... రేవంత్ సాంగ్ పై రేగిన చిచ్చు... కాంగ్రెస్ నేత దారుణ హత్య

Latest Videos

బిఆర్ఎస్ అధికారంలో వుండగా పారిశుద్ద్య కార్మికుల సంక్షేమానికి కృషి చేసిందని కేటీఆర్ గుర్తుచేసారు. చాలిచాలని జీతాలతో పనిచేస్తున్న వారికి జీతాలు పెంచామని... వారు గౌరవప్రదంగా జీవించేలా చేసామన్నారు. కార్మికులు ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, పీఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ లీవ్ సదుపాయాలు కల్పించేలా చూడాలని కోరారని ... వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని కేటీఆర్ తెలిపారు. 

ఇక నూతన సంవత్సరం సందర్భంగా కేటీఆర్ కు బిఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి తెలంగాణ భవన్ కు చేరుకున్న నాయకులు కేటీఆర్ ను కలిసారు. ఈ సందర్భంగా పుష్ఫగుచ్చాలు అందించి కేటీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

click me!