ఢిల్లీలో బీఆర్ఎస్ నిరసన.. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం..

Published : Mar 11, 2023, 12:43 PM IST
ఢిల్లీలో బీఆర్ఎస్ నిరసన.. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం..

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న సమయంలో ఢిల్లీలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న సమయంలో ఢిల్లీలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అవమానకర వ్యాఖ్యలు చేశారని బీఆర్‌ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ సమీపంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. 

ఇటీవల బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై స్పందించారు. తెలంగాణ ప్రజల కోసమే కవిత అక్రమ మద్యం డీల్‌కు పాల్పడ్డారా? అని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన డబ్బును పంట రుణాల మాఫీకి ఖర్చు చేస్తున్నారా? లేదా ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ఉపయోగిస్తున్నారా? లేదా నిరుద్యోగ భృతికి ఖర్చు చేస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. 

Also Read; ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత..

‘కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా…’ అంటూ  బండి సంజయ్ కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వికెట్ పడిపోయిందని.. అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే