పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్.. ఈ నెల 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ

By Siva KodatiFirst Published Mar 3, 2024, 6:34 PM IST
Highlights

పార్లమెంట్ ఎన్నికలపై భారత్ రాష్ట్ర సమితి ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా ఈ నెల 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. తెలంగాణ భవన్‌లో ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు.

పార్లమెంట్ ఎన్నికలపై భారత్ రాష్ట్ర సమితి ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా ఈ నెల 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. నగరంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ సభ నిర్వహించనుంది. తెలంగాణ భవన్‌లో ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ దళపతి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి కేటీఆర్‌, హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, సంతోష్‌కుమార్‌, వినోద్‌కుమార్‌తో పాటు కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని నేతలు హాజరయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించాలని.. లోక్‌సభ ఎన్నిల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ వుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. మండల స్థాయిలోనూ పార్టీ సమావేశాలు నిర్వహించాలని.. బస్సు యాత్రలు చేద్దామని నేతలకు ఆయన సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ అనంతరం కేసీఆర్.. పెద్దపల్లి నియెజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బోయిన్‌పల్లి వినోద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. 

click me!