దేశ వ్యాప్తంగా దళితబంధు అమలు: బీఆర్ఎస్ కీలక తీర్మానాలు

By narsimha lode  |  First Published Apr 27, 2023, 2:45 PM IST

బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో  కీలక తీర్మానాలు  చేశారు.  ఇవాళ  కేసీఆర్ అధ్యక్షతన  బీఆర్ఎస్  ఆవిర్భావ దినోత్సవరం  సందర్భంగా  ప్రతినిధుల  సభ నిర్వహించారు. 
 


హైదరాబాద్:తమకు   అధికారం అప్పగిస్తే దేశ వ్యాప్తంగా దళిత బంధు  అమలు చేస్తామని బీఆర్ఎస్  హామీ ఇచ్చింది. బీఆర్ఎస్  జనరల్ బాడీ సమావేశం  గురువారంనాడు తెలంగాణ భవన్ లో  జరిగింది.  ఈ సమావేశంలో  పలు అంశాలపై  తీర్మానాలు  చేశారు.   ప్రతి రాష్ట్రంలో భారీ ప్రాజెక్టు నిర్మాణం విషయమై  కూడా  తీర్మానం  చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో  మాదిరిగానే  దేశ వ్యాప్తంగా  24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని  తీర్మానం  చేసింది.  విదేశాలకు  దేశీయ  ఆహార ఉత్పత్తుల  ఎగుమతి చేసేందుకు  ప్రణాళికలపై  తీర్మానం  చేసింది  బీఆర్ఎస్.  దేశంలో బీసీ జనగణన జరగాలని తీర్మానం  చేశారు.  దేశంలో  గుణాత్మక మార్పు నకు ప్రణాళికలు చేస్తామని  బీఆర్ఎస్  తీర్మానం  చేసింది.

Latest Videos

also read:తెలంగాణ భవన్ లో ప్రారంభమైన బీఆర్ఎస్ జనరల్ బాడీ: కేసీఆర్ దిశానిర్ధేశం

బీఆర్ఎస్  ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో  భాగంగా  ఇవాళ  పార్టీ జనరల్ బాడీ  సమావేశం  నిర్వహించారు.  ఈ సమావేశానికి  ఎంపిక  చేసిన 279 మంది  ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ఏడాది  చివర్లో జరిగే  అసెంబ్లీ ఎన్నికల  గురించి  కూడా  కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం  చేయనున్నారు. బీఆర్ఎస్  రాజకీయ తీర్మానంలో  ఏం చెప్పనుందనేది  ఆసక్తి నెలకొంది. 

 

click me!