హిమాన్షుపై ప్రశంసల జల్లు కురిపించిన ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్.. ఎందుకో తెలిస్తే.. మీరూ సూపర్ అంటారు...

Published : Feb 18, 2023, 08:57 AM IST
హిమాన్షుపై ప్రశంసల జల్లు కురిపించిన ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్.. ఎందుకో తెలిస్తే.. మీరూ సూపర్ అంటారు...

సారాంశం

తెలంగాణ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు మీద ఎమ్మెల్సీ కవిత ప్రశంసల జల్లు కురిపించారు. సూపర్ అల్లుడూ.. అంటూ మెచ్చుకున్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.   తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడిగా, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కొడుకుగా అందరికీ అతను సుపరిచితమే. అయితే, ఇవే కాదు తనలో మరిన్ని టాలెంట్లు ఉన్నాయని నిరూపించుకుంటున్నాడు హిమాన్షు.  ఇటీవలే తన నాయకత్వ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు హిమాన్సులో ఉన్న మరో టాలెంటును ప్రపంచానికి పరిచయం చేశాడు. దీంతో అతని మీద ప్రశంసలు  వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకీ ఈసారి హిమాన్షు ఏం చేశాడంటే.. ‘ గోల్డెన్ అవర్’ హిమాన్షురావు పాట పాడాడు. ఈ ఇంగ్లీషు సాంగ్ ఆలపించడంలో హిమాన్షు ఉచ్చరించిన ఇంగ్లీషు యాస హైలెట్ అని చెప్పొచ్చు. అచ్చం ఆ పాట పాడిన జాకబ్ లాసన్ ను తలపించేలా హిమాన్షురావు ఈ కవర్ సాంగును ఆలపించాడు. ఈ పాటను ఆలపించడమే కాదు.. దాన్ని రికార్డు చేసి ‘గోల్డెన్ అవర్ X  హిమాన్షు కవర్’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేశాడు.

ఈ పాట విన్న మంత్రి కేటీఆర్ పుత్రోత్సాహంతో మురిసిపోయారు.  కొడుకు ప్రతిభకు ఫిదా అయ్యారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో తన అకౌంట్ లో షేర్ చేశారు. ‘సూపర్ ఫ్రౌడ్ అండ్ ఎగ్జైటెడ్ ఫర్ మై సన్’ అంటూ ఈ పోస్టుకు కామెంట్ కూడా పెట్టారు. ‘నాకు చాలా నచ్చింది.. మీ అందరికీ కూడా నచ్చుతుందనుకుంటాను..’  అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ పాట విన్ననెటిజన్లు.. నిజంగానే అద్భుతంగా పాడావంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

తన మేనల్లుడు హిమాన్షు పాడిన పాటపై ఎమ్మెల్సీ కవిత కూడా సంతోషంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా హిమాన్షిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘నీ పాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది.. చెవులకు ఇంపైన స్వరాన్ని వినిపించావ్ అల్లుడు.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను’ అంటూ అతని పాటను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. అంతేకాదు అల్లుడు హిమాన్షు చేసే మరో మ్యూజిక్  ఆల్బమ్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్