ఆడబిడ్డ తలుచుకుంది... ఇక మీ అడ్రస్ గల్లంతే : బండి సంజయ్ కు కవిత కౌంటర్

Published : Jun 13, 2023, 05:24 PM IST
ఆడబిడ్డ తలుచుకుంది... ఇక మీ అడ్రస్ గల్లంతే : బండి సంజయ్ కు కవిత కౌంటర్

సారాంశం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న మహిళా సంక్షేమ దినోత్సవం బండి సంజయ్, కల్వకుంట్ల కవితకు మధ్య మాటలయుద్దం సృష్టించింది. 

హైదరాబాద్  : తెలంగాణ ఆడబిడ్డలకు తండ్రిలా, అన్నలా, తమ్ముడిలా, మేనమామలా... మొత్తానికి మహిళా సంరక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అన్నారు. మహిళా సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి వుందని... కంటికి రెప్పలా వారిని కాపాడుకునే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకున్నారని అన్నారు. మహిళా సాధికారత కోసం విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టిన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మహిళ సంక్షేమ దినోత్సవ వేడుకలు జరిగాయి. అయితే ఈ దినోత్సవం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేసారు. 'గవర్నర్ కు దక్కదు గౌరవం... ఆడబిడ్డలకు లేదు అండ... గిరిజన మహిళలపై పోలీస్‌ గిరీ... బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం... ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం...అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం' అంటూ సంజయ్ ట్వీట్ చేసారు. 

ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంజయ్ చేసిన కామెంట్స్ కి ఎమ్మెల్సీ కవిత అదే ట్విట్టర్ వేదికన కౌంటరిచ్చారు. 'పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం... దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు... దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం... నినాదాలకే పరిమితమైన భేటీ బచావో... భేటీ పడావో... సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి... మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం... ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం... ఆడబిడ్డ తలుచుకుంది... ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది' అంటూ కవిత సంజయ్ కు సమాధానమిచ్చారు. 

Read More  కాంగ్రెస్ లోకి కేసీఆర్ సన్నిహితుడు కూచాడి శ్రీనివాసరావు.. బీఆర్ఎస్ కు బిగ్ షాక్..

ఇక మహిళా సంక్షేమానికి కేసీఆర్ ఏం చేస్తున్నారో కవిత వివరించారు. ఆడపిల్లల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్ పథకాల ద్వారా డబ్బులిచ్చిన కేసీఆర్ ఇంటిపెద్దలా మారారని అన్నారు. ఇక బాలింతలకు కేసీఆర్ కిట్ ఇచ్చి మేనమామలా, న్యూట్రీషన్ కిట్ ఇచ్చి డాక్టర్ లా, ఆరోగ్యలక్ష్మితో ఆరోగ్యదాతగా, షీ టీమ్ ద్వారా సంరక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మారారని కవిత అన్నారు. మొత్తంగా తెలంగాణ ఆడబిడ్డలకు తండ్రి, అన్న, తమ్ముడు, మేనమామ ఇలా అన్నీ తానేఅయి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని కవిత అన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?