
హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ మైనర్ బాలుడు చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. అయితే చిన్నారి ప్రతిఘటించడంతో ఆమెపై బీర్ బాటిల్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. తల్లితో కలిసి చిన్నారి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.