తాను సుప్రీంకోర్టులో ఇవాళ ఎలాంటి ముందస్తు పిటిషన్లు దాఖలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
హైదరాబాద్: తాను సుప్రీంకోర్టులో ఇవాళ ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తన పిటిషన్ ను ముందస్తుగా విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాను ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని కవిత తేల్చి చెప్పారు.
గౌరవ సుప్రీం కోర్టులో నేను దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానున్నది. నేను ఈ రోజు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. https://t.co/q8x3wkRKzV
— Kavitha Kalvakuntla (@RaoKavitha)
I have made no early appeal before the Hon’ble Supreme Court. The only which is pending will be heard on 24th March
— Kavitha Kalvakuntla (@RaoKavitha)
గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని ఆమె వివరించారు. ఈ నెల 15వ తేదీన ఈడీ విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 24న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. మరో వైపు ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు.
సుప్రీంకోర్టు విచారణ తర్వాతే విచారణకు హాజరు కానున్నట్టుగా కవిత ఈడీకి లేఖ పంపారు. కానీ ఈ నెల 20వ తేదీనే విచారణకు రావాలని కవిత ఈడీ అధికారులు నిన్న సమన్లు పంపారు. దరిమిలా తన పిటిషన్ ను ముందస్తుకు విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే తాను ఈ విషయమై సుప్రీంకోర్టును తన పిటిషన్ ను మందస్తుగా విచారించాలని పిటిషన్ దాఖలు చేయలేదని కవిత ప్రకటించారు.