దళితబంధులో అవినీతి.. ఎవరైనా లంచం అడిగితే బట్టలూడదీయిస్తా : కడియం శ్రీహరి వార్నింగ్

By Siva Kodati  |  First Published Oct 8, 2023, 2:34 PM IST

దళితబంధు కోసం ఎవరైన లంచం అడిగితే వారిని బట్టలూడదీయిస్తాయని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి కడియం శ్రీహరి.  ఏ ప్రభుత్వ పథకానికి రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన పనిలేదని కడియం శ్రీహరి పేర్కొన్నారు. 


దళితబంధు కోసం ఎవరైన లంచం అడిగితే వారిని బట్టలూడదీయిస్తాయని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి కడియం శ్రీహరి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరాలని ఆకాంక్షించారు. అయితే దళితబంధు, గృహలక్ష్మీ వంటి పథకాలు రావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని కొందరు లబ్ధిదారుల వద్ద డిమాండ్ చేస్తున్నారని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వ పథకానికి రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన పనిలేదని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఎవరైనా లండం డిమాండ్ చేస్తే తనకు చెప్పాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో స్టేషన్ ఘన్‌పూర్‌ను అభివృద్ధి చేస్తానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. 

Also Read: ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గానికి రావాల్సిన అవసరం లేదు: రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు

Latest Videos

కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. దళితబంధు పథకం విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద వుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇది తన చివరి వార్నింగ్ అని.. మళ్లీ వసూళ్లకు పాల్పడితే టికెట్ దక్కదని, పార్టీ నుంచి వెళ్లిపోవడమేనని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మీ అనుచరులు తీసుకున్నా మీదే బాధ్యతని ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పులు రావడం లేదు. 

click me!